అన్వేషించండి
Winter Immunity Boosters : చలికాలంలో జలుబు, ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ 7 ఇమ్యూనిటీ బూస్టర్స్ ట్రై చేయండి
Top Ayurvedic Herbs for Winter : చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని సహజ నివారణులు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే..
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్స్ ఇవే
1/7

చలికాలంలో తులసిని రోజూ ఐదు ఆకులు పరగడుపున ప్రతి ఉదయం తింటే చాలామంచిది. తులసి శ్వాసకోశంలో కణాలకు వచ్చే వైరస్లను నిరోధిస్తుంది. పరిశోధనల్లో కూడా ఇది ప్రూవ్ అయింది. అల్లం, నల్ల మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పచ్చి ఆకులను నమలడం కూడా మంచిదే.
2/7

పసుపును పాలలో వేసి తాగితే మంచిది. కానీ దానిని సరైన విధంగా తాగాలంటే.. దానిలో నల్ల మిరియాలు కూడా వేయాలి. అప్పడే శరీరం కర్కుమిన్ తీసుకోగలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రపోయే ముందు తాగాలనుకుంటే జాజికాయ కూడా వేసుకోవచ్చు. దగ్గును తగ్గించడం నుంచి.. నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తుంది.
3/7

అల్లం తాజాగా తురిమి.. తేనెతో కలిపి తీసుకోండి. ఇరవై నిమిషాలు ఆగండి. అప్పుడే జింజరాల్ అనే మూలకం గొంతులో బాక్టీరియా పెరగకుండా చేస్తుంది. చాలా మంది దీన్ని తొందరగా తీసుకుంటారు. గొంతులో మొదట గీరుతున్నట్లు అనిపించినప్పుడు.. ఒక స్పూన్ తీసుకోండి. మంటగా ఉన్నప్పుడు కాదు. సమయం మోతాదు కంటే ముఖ్యం.
4/7

వాము వాసన థైమోల్ విడుదల చేస్తుంది. ఇది ఆసుపత్రి-స్థాయి క్రిమిసంహారక మందులలో ఉండే పదార్థం. వారానికి ఒకసారి దీని ఆవిరి పట్టడం వల్ల సైనస్ సమస్య తగ్గుతుంది. శ్లేష్మ పొరలను బలంగా చేస్తుంది. మొత్తం శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్ల నుంచి తప్పిస్తుంది.
5/7

అశ్వగంధ రోగనిరోధక శక్తిని అందిస్తుంది. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలతో మూడు వారాలు తీసుకుంటే మంచిది. ఫ్లూ, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది.
6/7

ఉసిరిలో నారింజ కంటే ఇరవై రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది టానిన్లు రక్షిస్తాయి. కాబట్టి వేడిని తట్టుకుంటుంది. తాజాగా ఉన్నా.. ఎండబెట్టినా.. ఊరగాయ రూపంలోనైనా తీసుకోవచ్చు. మొత్తం పండు, విడిగా ఉన్న విటమిన్ సి కంటే బాగా పనిచేస్తుంది.
7/7

గిలోయ్ కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచి.. అంటువ్యాధులను కంట్రోల్ చేస్తుంది. శరీరంపై వాటి ఎఫక్ట్ ఉండకుండా చేస్తుంది. చలికాలంలో గిలోయ్ కాండం రసాన్ని తేనెతో కలిపి రెండు వారాల పాటు తీసుకుంటే.. జ్వరాలు రాకుండా ఆగిపోతాయి.
Published at : 22 Nov 2025 09:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















