అన్వేషించండి

Lightning Temperature vs Sun:సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి కలిగి ఉన్న పిడుగు వెనుక ఉన్న రహస్యాలివే!

Lightning Temperature vs Sun:పిడుగు సూర్యుడి కంటే వేడిగా ఉంటుందా? 30వేల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో నింగిని చీల్చుకొని వచ్చే పిడుగు వెనుక ఉన్న రహస్యాలు గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిడుగులు సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు వేడిగా ఉంటాయి.
  • మేఘాలలో ఘర్షణ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రవాహమే పిడుగు.
  • పిడుగు వల్ల గాలి వేడెక్కి, పేలినట్టు విస్తరించడమే ఉరుము.
  • పిడుగు తాకినా, తక్కువ సమయం వల్ల వస్తువులు కాలవు.

Why Lightning Causes Thunder:ఆకాశంలో మెరుపులు కనిపించిన క్షణం ఆశ్చర్యపోతాం, మరో క్షణం వచ్చే ఉరుము శబ్దానికి భయపడతాం. కానీ ఆ మెరికే కాంతి వెనుకు ఎంతటి వినాశకరమైన ఉష్ణోగ్రత ఉందో తెలిస్తే విస్తుపోతారు. మనం సూర్యుడిని అత్యంత వేడికి నిదర్శనంగా చెబుతాం. అయితే ప్రకృతిలో మన కళ్ల ముందే కనిపించే పిడుగు, సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడిని కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది. అసలు ఒక పిడుగు అంత వేడిని ఎలా పుట్టిస్తుంది? అది భూమిని తాకినప్పుడు ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం. 

పిడుగు అంటే ఏంటీ? ఎలా పుడుతుంది?

పిడుగు అనేది కేవలం కాంతి మాత్రమే కాదు. అది ఒక భారీ స్థాయి విద్యుత్ డిశ్చార్జ్‌. ఉరుములతో కూడిన మేఘాలలో, మంచు స్ఫటికాలు, వడగళ్లు ఒకదానికొకటి వేగంగా ఢీ కొంటాయి. ఆ ఘర్షణ వల్ల మేఘం దిగువ భాగంలో ప్రతికూల ఛార్జ్ ఎగువ భాగంలో, భూమిపై సానుకూల ఛార్జ్ పేరుకుపోతాయి. 

ఈ రెండు ఛార్జ్‌ల మధ్య తేడా విపరీతంగా పెరిగినప్పుడు, గాలిలోని అడ్డంకులను ఛేదించుకుంటూ ఒక భారీ విద్యుత్ ప్రవాహం భూమి వైపు లేదా మరో మేఘం వైపు దూకుతుంది. దీనినే మనం పిడుగు అంటాం. 

సూర్యుడి కంటే వేడిగా... 

సాధారణంగా సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఒక పిడుగు బోల్డ్‌ తన ప్రయాణ మార్గంలో గాలిని క్షణకాలంలో 30వేల డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేస్తుంది. 

అంటే పిడుగు సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడి అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సూర్యుడి కేంద్ర భాగంలో ఉష్ణోగ్రత 1.5కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇది పిడుగు కంటే 500 రెట్లు ఎక్కువ. కాబట్టి మెరుపు సూర్యుడి ఉపరితలం కంటే వేడిగా ఉంటుంది. 

పిడుగులో అంత వేడి ఎక్కడి నుంచి వస్తుంది?

గాలి నిజానికి విద్యుత్ ప్రసరణకు మంచి మాధ్యమం కాదు. కానీ లక్షల వోల్టుల విద్యుత్ గాలి ద్వారా ప్రవహించాల్సి వచ్చినప్పుడు ఆ గాలి విపరీతమైన నిరోధకతను ప్రదర్శిస్తోంది. ఈ నిరోధకత వల్ల గాలి అణువులు విచ్చిన్నమైన, ఆ ప్రాంతం సెకనులో మిలియన్ వంతు కాలంలోనే ప్లాస్మా స్థితికి చేరుకుంటుంది. ప్లాస్మా అనేది పదార్థంలోని నాల్గో స్థితి, ఇది అత్యంత శక్తివంతమైంది. వేడిని పుట్టించేది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1 జపాన్‌లో చేసింది దొంగపని - పైగా పోలీసులకు లంచం ఆఫర్ - భారతీయ పర్యాటకురాలికి ఏ శిక్ష పడిందంటే?
2 యూకేలో చదవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఫీజులు, అద్దె, ఫుడ్ పూర్తి వివరాలు ఇవే
3 జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?
4 బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?
5 చెక్క మండిస్తే ఎరుపు రంగులో, LPG మంట నీలం రంగులో ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న సైన్స్‌ ఏంటి?

ఉరుము వెనుక ఉన్న కారణం  

మెరుపు వచ్చిన కొద్ది సెకన్లకు ఉరుము శబ్దం వినిపిస్తుంది. మెరుపు వల్ల గాలి 30వేల డిగ్రీల వేడికి గురైనప్పుడు, అది ఒక్కసారిగా విస్పోటనం చెందినట్టు విస్తరిస్తుంది. ఆ వెంటనే గాలి చల్లబడి సంకోచిస్తుంది. ఈ వేగవంతమైన విస్తరణ, సంకోచం వల్ల గాలిలో ఒక శక్తివంతమైన షాక్ వేవ్ పుడుతుంది. అదే మనకు ఉరుము శబ్ధంగా వినిపిస్తుంది. 

అంత వేడిగా ఉన్నప్పుడు మంటలు చెలరేగవు ఎందుకు?

పిడుగు సూర్యుడికంటే వేడి అయినప్పటికీ, అది కేవలం మైక్రో సెకన్లు పాటు మాత్రమే ఉంటుంది. అంత తక్కువ సమయంలో వేడి ఇతర వస్తువుల్లోకి లోతుగా వెళ్లే అవకాశం ఉండదు. అందుకే పిడుగు పడిన చెట్లు కొన్నిసార్లు కాలిపోకుండా ఉంటాయి. మరికొన్నిసార్లు చెట్టు లోపల ఉన్న తేమ ఆ వేడికి ఒక్కసారిగా ఆవిరిగా మారి, ప్రెజర్‌కు చెట్టు ముక్కలైపోతుంది. 

పిడుగుల దాడికి గురవుతారని ఎలా తెలుస్తుంది?

ఒక వేళ మీరు బయట ఉన్నప్పుడు మీ జుట్టు నిక్కబొడుకుచున్నా, చర్మంపై గిలిగింతలు పెట్టినట్టు అనిపించినా, అది మీకు ప్రమాద హెచ్చరిక. మీ చుట్టూ ఉన్న గాలిలో విద్యుత్ ఛార్జ్ విపరీతంగా పెరుగుతోందని అర్థం. వెంటనే మీరు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. 

పిడుగులు ఎప్పుడూ ఎత్తైనా వస్తువులను తాకుతాయి. చెట్లు పిడుగులను ఆకర్షిస్తాయి. అవి ధ్వంసమైన మీ మీద పడే ప్రమాదం ఉంది. కారు లోపల ఉండటం లేదా కాంక్రీట్ భవనంలో ఉండటం సేఫ్‌. ఒక వేళ మీకు ఏ ఆశ్రయం లేకపోతే భూమిపై పడుకోకుండా ,కాళ్లు దగ్గరకు పెట్టుకొని ముడుచుకొని కూర్చోండి.  

Frequently Asked Questions

పిడుగు అంటే ఏమిటి మరియు అది ఎలా ఏర్పడుతుంది?

పిడుగు అనేది ఒక భారీ విద్యుత్ ఉత్సర్గం. ఉరుములతో కూడిన మేఘాలలో ఛార్జీలు పేరుకుపోయి, వాటి మధ్య తేడా పెరిగినప్పుడు పిడుగు ఏర్పడుతుంది.

పిడుగు ఎంత వేడిగా ఉంటుంది?

పిడుగు సూర్యుడి ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇది గాలిని క్షణకాలంలో 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది.

పిడుగులో అంత వేడి ఎక్కడి నుంచి వస్తుంది?

లక్షల వోల్టుల విద్యుత్ గాలి ద్వారా ప్రవహించేటప్పుడు, గాలి అణువులు విచ్చిన్నమై ప్లాస్మా స్థితికి చేరుకుంటాయి. ఈ ప్లాస్మానే అధిక వేడిని పుట్టిస్తుంది.

మెరుపు వచ్చిన వెంటనే ఉరుము ఎందుకు వినిపిస్తుంది?

మెరుపు వల్ల గాలి ఒక్కసారిగా వేడెక్కి విస్ఫోటనం చెంది విస్తరిస్తుంది. వెంటనే చల్లబడి సంకోచించడం వల్ల ఏర్పడే షాక్ వేవ్ శబ్దంగా వినిపిస్తుంది.

పిడుగులు ఎత్తైన వస్తువులను ఎందుకు తాకుతాయి?

పిడుగులు ఎలక్ట్రికల్ ఛార్జ్ ను అనుసరిస్తాయి. ఎత్తైన వస్తువులు సులభంగా విద్యుత్ ను భూమికి చేర్చగలవు కాబట్టి, పిడుగులు వాటిని ఎక్కువగా తాకుతాయి.

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget