Forensic Science Lab Fire Update: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. ఆధారాలపై అదంతా దుష్ప్రచారమే: శిఖా గోయల్ క్లారిటీ
Forensic Science Lab Fire Update: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కాలిపోలేదని సంస్థ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు.

Shikha Goyal About FSL fire accident | హైదరాబాద్ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్‌ఎల్ డైరక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. 2 కీలక కేసులకు సంబంధించిన డేటా ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఎస్‌ఎల్ లో కాలిపోయిన డాక్యుమెంట్స్ ఇదివరకే ఏసీబీ కోర్టుకు సమర్పించామని, మా వద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉంటాయన్నారు. ఏదైనా ఘటనలో ఆధారాలు కాలిపోయినా మా టీమ్ వాటిని డేటా నుంచి రిట్రీవ్ చేస్తుందని తెలిపారు.
నాంపల్లిలోని ఎఫ్ఎస్‌ఎల్ ఆఫీసులో శనివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మంటలను మొదట ఎఫ్‌ఎస్‌ఎల్ ఉద్యోగి గుర్తించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యపడలేదని.. అదే సమయంలో మంటలు క్రమంగా ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు.

కీలక కేసు ఆధారాలపై దుష్ప్రచారం..
అనాలసిస్ డాక్యుమెంట్ లో కొన్ని ఫైల్స్ దగ్దం కాగా, వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు శిఖా గోయల్ తెలిపారు. ఈ ప్రమాదంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవలం లేదన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు.
2015లో నమోదైన ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసు మెటీరియల్స్ ధ్వంసం అయినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశామన్నారు. ఓటుకు నోటు కేసు పూర్తి రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలిపోయిన ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయని తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను సైతం ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశాం. 7 ఆధారాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ఉంచుతందని, డేటాను టీమ్ రిట్రీవ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

కేసు నమోదు చేసిన పోలీసులు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పకడ్బందీగా ఉండేచోట కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు రావడ, కీలక పత్రాలు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా కావాలనే సాక్ష్యాలను రూపుమాపడానికి ఈ పని చేశారా అనే కుట్ర కోణంపై పోలీసులు దృష్టి సారించారు























