Hyderabad News: 12 రోజుల్లో పెళ్లి - సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం, ఎక్కడంటే?
Woman Software Engineer Suicide: హైదరాబాద్ లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మరో 12 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె సూసైడ్ చేసుకుంది.
Woman Software Engineer Suicide in Hyderabad: 12 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలి (Gachibowli) పీఎస్ పరిధిలోని కొత్తగూడలో (Kothaguda) సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గొసుకులపల్లికి చెందిన ఆమె కొత్తగూడలోని పీజీ హాస్టల్ లో ఉంటూ సాఫ్టవేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. మార్చి 17న ఆమెకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం హాస్టల్ లోని బాత్ రూంకు వెళ్లిన ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో రూమ్ మేట్స్ అనుమానంతో తలుపులు తెరిచి చూడగా.. టవల్ తో షవర్ రాడ్ కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే అమెను కిందకు దించిన వారు.. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. కాగా, పెళ్లి నిశ్చయమైన నేపథ్యంలో ఇటీవలే విద్యశ్రీ పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. గురువారం కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హాస్టల్ వద్దకు వెళ్లి మాట్లాడిన తర్వాత సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Narayankhed: నారాయణఖేడ్ లో భారీ అగ్ని ప్రమాదం - మూడు కార్లు దగ్ధం