అన్వేషించండి

Guntur Crime News: ప్రియుడితో భర్తను హత్య చేపించిన మహిళ, మృతుడి ఫొటో చూసి హత్యగా తేల్చిన ఎస్పీ

Andhra Pradesh News | ఓ వివాహిత తన ప్రియుడితో భర్తను హత్య చేపించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల ఈ దారుణ ఘటన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

గుంటూరు: వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరు హత్యకు, మరొకరు జైలుకు వెళ్తుండటంతో పిల్లలు అనాథలు అవుతున్నారు. ఓ మహిళ ఆస్తి కోసం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసి, చివరికి అడ్డంగా దొరికిపోయింది. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు  మంగళవారం మీడియాకు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..
సత్తెనపల్లి పట్టణానికి చెందిన లక్ష్మికి 15 సంవత్సరాల కిందట గుంటూరు రూరల్ మండలంలోని పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ గోవిందరాజుతో వివాహం జరిగింది.  గోవిందరాజు కొన్నేళ్ల కిందట మద్యానికి అలవాటు పడ్డాడు. నిత్యం తాగి గొడవపడుతున్నాడని ఆరేళ్ల నుంచి లక్ష్మీ తన భర్తకు దూరంగా ఉంటోంది. క్యాటరింగ్ పనులు చేస్తున్న పెర్నేటి వెంకటేశ్వర్లు (వెంకట్)తో మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది.  ఈ క్రమంలో ఆస్తి కోసం భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది.

విలువైన ఇళ్లు, స్థలాల కోసం హత్యకు ప్లాన్
తన భర్త గోవిందరాజుకు కోటిన్నర విలువైన ఇళ్లు, స్థలాలు ఉన్నాయని, అతడ్ని హత్య చేస్తే అవి మన సొంతం అవుతాయని ప్రియుడు వెంకటేశ్వర్లుకు చెప్పింది. లక్ష్మి ప్లాన్ తెలుసుకున్న ప్రియుడు వెంకట్ తన స్నేహితుడు షేక్ ఖాసిం సైదాతో కలిసి గోవిందరాజు హత్యకు ప్లాన్ చేశాడు.  సెప్టెంబరు 18న గోవిందరాజుకు మద్యం తాగించి, సాతులూరులోని పెదరెడ్డిపాలెం సమీపంలో అతడిపై దాడిచేశారు. మొలతాడు తెంచి మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. గోవిందరాజు స్పృహ తప్పడంతో చినిపోయాడనుకున్నారు. 

లక్ష్మి తన లవర్ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలాగ చూపించాలని చెప్పింది. తరువాత గోవిందరాజును ఆటోలో తీసుకెళ్లి అబ్బూరులో రోడ్డు పక్కన పడేశారు. కొన ఊపిరి ఉన్నట్లు గుర్తించిన నిందితులు ఇనుప రాడ్‌తో కొట్టి, గొంతు పిసికి హత్య చేశారు. పెరేచర్ల-పలకలూరు రోడ్డు పక్కన మృతదేహాన్ని  పారేసి వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19న సమాచారం అందడంతో  పోలీసులకు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, గోవిందరాజు మృతదేహాన్ని చూసి ఇది హత్యగా నిర్ధారించారు. మృతుని నాలుక బయటపెట్టి ఉందని హత్య అని భావించి మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు వెల్లడయ్యాయి. ఆస్తి కోసం గోవిందరాజును హత్య చేసినట్లు అంగీకరించింది. హత్యకు ప్లాన్ చేసిన లక్ష్మిని, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget