Warangal News : బాలికను గర్భవతి చేసిన సర్పంచ్, పోలీసు కేసు పెట్టకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు

Warangal News : వరంగల్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్, అతడి అనుచరుడు బాలికపై అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పోలీసు కేసు పెట్టకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

FOLLOW US: 

Warangal News : వరంగల్ జిల్లాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, అతని అనుచరుడు బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం సర్పంచ్ దగ్గరకు వెళితే అతడు కూడా అత్యాచారం చేశాడని బాలిక ఆరోపిస్తుంది. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని బాలిక గ్రామ పెద్దలను ఆశ్రయించింది. వర్ధన్నపేట మండలం ల్యాబర్ధి గ్రామ సర్పంచ్ పస్తం రాజు, పత్రి నాగరాజు బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కడుపునొప్పి రావడంతో బాలిక ఆస్పత్రిలో చూపించుకుంటే నాలుగు నెలల గర్భిణి అని వైద్యులు తేల్చారు. తన కూతురుకు న్యాయం చేయాలంటూ బాధితురాలి తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా సర్పంచ్, గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.  

రాజీ ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు

అయితే ఈ వ్యవహారం బయటకు రాకుండా అత్యాచారానికి గురైన బాలికను ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉంచారు కుటుంబ సభ్యులు. మరోవైపు తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితురాలి తల్లిదండ్రులను ఊరి చివర్లోని తోటలోకి తీసుకెళ్లి గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ముగిసిన తర్వాతే బాలికను బయటకు తీసుకురావాలని బాధితురాలి బంధువులు తల్లిదండ్రులకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

"నా బిడ్డపై సర్పంచ్, అతని అనుచరుడు అత్యాచారం చేశారు. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఈ విషయంపై వాళ్లిద్దరూ గొడవ కూడా పడ్డారు. పోలీసు కేసు పెడతానంటే వద్దని గ్రామ పెద్దలు అంటున్నారు. సర్పంచ్ తో మాట్లాడి న్యాయం చేద్దామని చెబుతున్నారు. నేను తోటలో పనికి పోతుంటాను. ఇలా బిడ్డను ఆగం చేశారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నాను." బాలిక తండ్రి ఆవేదనతో చెప్పారు. 

కన్నకూతుళ్లపై తండ్రి ఘాతుకం 

కన్న కూతుళ్లపై ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. వావివరసలు మర్చిపోయి లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్ పూర్ లోని చోపాస్ని హౌసింగ్ బోర్డు పరిధిలో కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నాడు. పెద్ద కూతురుపై ఆరు సంవత్సరాల వయసు నుంచే లైంగికంగా వేధించినట్లు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని తల్లికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. బాధితురాలికి 2017లో వివాహం అయింది. దీంతో ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మృగాడి కన్ను చిన్న కూతురిపై పడింది. ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీంతో తన సోదరిని రక్షించాలని పెద్ద కూతురు పోలీసులను ఆశ్రయించింది. దీంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదుతో తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Published at : 09 Apr 2022 07:18 PM (IST) Tags: warangal news laborti village trs sarpanch

సంబంధిత కథనాలు

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి

Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

టాప్ స్టోరీస్

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు