అన్వేషించండి

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : ఉత్తరాఖండ్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకునే తల్లి వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

Uttarakhand News : ప్రభుత్వ పథకాల కోసం ఇటీవల అన్నాచెల్లిళ్లు వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నవమాసాలు మోసి, కనిపెంచిన కొడుకునే ఓ మహిళ పెళ్లి చేసుకున్న విచిత్రమైన ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌నకు చెందిన బబ్లీ, ఇంద్రరామ్‌ ఇద్దరు భార్యాభర్తలు. ఇంద్రరామ్‌ బబ్లీకి రెండో భర్త. వీరిద్దరికీ 11 ఏళ్ల క్రితం పెళ్లి  అయింది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. బబ్లీకి మొదటి భర్త వల్ల ఇద్దరు కొడుకులు పుట్టారు. మొదటి భర్త వదిలేయడంతో బబ్లీ ఇంద్రరామ్‌ను రెండో వివాహం చేసుకున్నది. ఇంద్రరామ్‌, బబ్లీ కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో మొదటి భర్తతో కలిగిన పెద్ద కుమారుడు వారి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. 

రెండో భర్త ఫిర్యాదు 

కొద్దికాలంగా పెద్ద కుమారుడు తన తల్లి దగ్గరకు వస్తూ వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుంటి ఇద్దరూ కనిపించకుండా పోయారు. వీరిద్దరి వ్యవహారంపై తనకు ముందు నుంచి అనుమానం ఉందని, ఇద్దరు పెళ్లి చేసుకున్నారని, ఇంట్లో నుంచి రూ.20 వేలు ఎత్తుకుపోయారని ఇంద్రరామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. తనకు బాబ్లీ అనే మహిళతో పదకొండేళ్ల క్రితం వివాహమైందని ఇంద్రరామ్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు మొదటి భర్త నుంచి కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారని, వాళ్లను ఆమె ఇంద్రరామ్‌ను వివాహం చేసుకున్నప్పుడు విడిచిపెట్టేసింది.

కోడలికి పెళ్లి చేసిన అత్తమమాలు 

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చీకటి చేసింది. అయితే ఓ తల్లిదండ్రులు తమ కొడుకును కోల్పోయామన్న బాధను తట్టుకుని, కోడలి జీవితం నాశనం కాకూడదని మరో వివాహం చేశారు. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారి, రెండో వివాహం చేశారు. తమ ఆస్తిని కూడా రాసిచ్చి ఘనంగా వివాహం చేశారు. మధ్యప్రదేశ్ లో ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్​ప్రకాష్‌ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి భోపాల్ నెట్‌లింక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. 2011లో రిచా తివారీతో ఆయనకు వివాహం జరిగింది. ప్రియాంక్ తివారి దంపతులకు అన్య తివారీ (9) కుమార్తె కూడా ఉంది. ఎంతో ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో కరోనా చిచ్చుపెట్టింది. గత ఏడాది ప్రియాంక్ తివారీ కరోనాతో చనిపోయారు. ప్రియాంక్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే కోడలు, మనవరాలి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రియాంక్ తివారి తల్లిదండ్రులు గొప్పగా ఆలోచించారు. 

భారీ పెళ్లి కానుక కూడా 

తమ కోడలికి మళ్లీ పెళ్లి చేసి, ఆమె జీవితంలో కొత్తవెలుగులు నింపారు. కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాగ్‌పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి పెళ్లి చేశారు. తన సొంత ఖర్చుతో కోడలికి వైభవంగా పెళ్లి చేశారు. తమ కుమారుడు కొన్న రూ.60 లక్షల విలువజేసే ఇంటిని కోడలికి పెళ్లి కానుకగా ఇచ్చారు.  పెళ్లి తర్వాత రిచా కూతుర్ని కూడా తీసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది. కోడలిని అదనపు కట్నం కోసం హింసించే అత్తామామలున్న ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మారి కోడలికి పెళ్లిచేసిన ప్రియాంక్ తల్లిదండ్రులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget