అన్వేషించండి

Hyderabad Crime News: హైదరాబాద్‌లో మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు

Doctor Suicide News | మేడ్చల్ మల్కాజిగిరిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో యువ మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ మహిళా డాక్టర్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సాయిబాబా నగర్‌లో నివాసముంటున్న 29 ఏళ్ల బత్తిని అనిత శనివారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అవివాహితురాలైన అనిత ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఆమె కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న అనిత..

మృతురాలు అనిత ఎల్బీ నగర్‌లోని షైన్ హాస్పిటల్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సూరారం పోలీసులు, గది తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పోలీసులు ఫిజియోథెరపిస్ట్ అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Hyderabad Crime News: హైదరాబాద్‌లో మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనిత కుటుంబ సభ్యులు, ఆమెతో కలిసి పనిచేసే సహచరుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మానసిక ఒత్తిడి లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో సూరారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డాక్టర్ల వరుస మరణాలు..

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు హత్యకు గురైన, ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు, కొన్ని చోట్ల వేధింపులు ఈ విషాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థిని ఎం. దీపిక (36) మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపిక, అనస్థీషియా విభాగంలో ఫైనలియర్ చదువుతూ బుధవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు హాజరయ్యారు. రాత్రి పది గంటల సమయంలో బయటి నుంచి ఆహారం తెప్పించుకుని తిన్న తర్వాత, ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తోటి విద్యార్థులకు తెలిపారు. విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయారు.

అయితే, రాత్రి 11:30 గంటల సమయంలో దీపిక ఆపరేషన్ గదిలోని బల్లపై స్పృహ లేకుండా పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే సీనియర్ వైద్యులు ఆమెకు సీపీఆర్ (CPR) నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రిలోని సిసి కెమెరాలను, హాస్టల్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్

ఈ ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విచారణకు ఆదేశించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, దీపిక తల్లిదండ్రులకు,  ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరణానికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటనతో తోటి వైద్య విద్యార్థుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Embed widget