అన్వేషించండి

Forensic Science Lab Fire Update: ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలన్నీ బుగ్గి - అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందా?

Hyderabad :హైదరాబాద్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక కేసుల సాక్ష్యాలు తగలబడిపోయాయి. దీంతో పలు కేసులు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Forensic Science Lab Fire Accident  Update: హైదరాబాద్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో ఈరోజు ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతయినట్లుగా తెలుస్తోంది.   సుమారు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

 కంప్యూటర్ ల్యాబ్‌లో మొదలైన మంటలు 

ఉదయం వేళ కార్యాలయం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్ విభాగం నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాద సమయంలో లోపల ఉన్న ఒక వ్యక్తికి గాయాలు కాగా, వెంటనే అప్రమత్తమైన సహచరులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

 రంగంలోకి డీసీపీ శిల్పవల్లి 

ప్రమాద వార్త తెలియగానే డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట అగ్నిప్రమాదం జరగడంపై ఆమె అధికారులను ఆరా తీశారు. అసలు మంటలు ఎలా మొదలయ్యాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు.

 కీలక సాక్ష్యాలు బుగ్గిపాలు 

ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. కంప్యూటర్ ల్యాబ్‌లో ఉన్న అనేక కీలకమైన కేసుల డేటా , భౌతిక పత్రాలు కాలి బూడిదయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు నేరాలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు ఈ ల్యాబ్‌లోనే ఉన్నాయి. సాక్ష్యాలు బుగ్గిపాలు కావడంతో ఆయా కేసుల విచారణపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 కుట్ర కోణం ఉందా? 

సాధారణంగా ఫోరెన్సిక్ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పకడ్బందీగా ఉంటాయి. అలాంటిది కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు రావడం, కీలక పత్రాలు ఉన్న చోటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా కావాలనే సాక్ష్యాలను రూపుమాపడానికి ఈ పని చేశారా? అనే కుట్ర కోణం పై పోలీసులు దృష్టి సారించారు. ల్యాబ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

 

 విచారణ ముమ్మరం 

క్లూస్ టీమ్ , ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు ఎంతవరకు దెబ్బతిన్నాయి, వాటి నుంచి డేటాను రికవరీ చేసే అవకాశం ఉందా అనే దానిపై ఐటీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు తారుమారైతే నేరస్తులకు మేలు జరుగుతుందనే కోణంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget