అన్వేషించండి

Telangana Municipal Elections 2026 : మున్సిపల్ పోరులో రెబల్స్ రగడ - కారు, చేయి, కమలాన్ని వణికిస్తున్న సొంత నేతలు

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు రెబల్స్ సెగ గట్టిగానే తగులుతోంది. చాలా చోట్ల అసంతృప్త నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.

Rebels pose a threat to all parties in elections:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్లైమాక్స్ మొదలైంది. పార్టీలు జారీ చేసిన బీ-ఫారాలు ఒకరికి దక్కితే, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమను విస్మరించారంటూ పలువురు నేతలు స్వతంత్రులుగా జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,700 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పటికీ, ఇంకా 12,900 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మెజారిటీ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన రెబల్స్ కావడం గమనార్హం. గెలుపు గుర్రాల కంటే, ప్రత్యర్థి గెలుపును అడ్డుకునే  ఓట్ల చీలిక వ్యూహంతో వీరు ముందుకు వెళ్తుండటం పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా ఉంది.

కాంగ్రెస్‌కు అధికార బలంతో పాటు అసమ్మతి సెగ 

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావించిన ఆశావాహులు టికెట్ ఆశించారు.  కానీ ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత క్యాడర్ భగ్గుమంటోంది. ఉదాహరణకు జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి ,  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య టికెట్ల కేటాయింపు వివాదం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితులే మెదక్, గద్వాల వంటి చోట్ల కూడా కనిపిస్తున్నాయి.  బీ-ఫారాల  పంపిణీలో జరిగిన జాప్యం ,  సమన్వయ లోపం వల్ల కాంగ్రెస్‌లో రెబల్స్ సంఖ్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్‌లోనూ అంతర్గత కుమ్ములాటలు 

ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నేతలు, టికెట్ దక్కని పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించి బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత పార్టీ వారే భారీగా నామినేషన్లు వేశారు. కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కంటే, సొంత పార్టీ అభ్యర్థులనే టార్గెట్ చేయడం అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

 కమలంలోనూ ముదిరిన అసంతృప్తి 

కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలోనూ పుంజుకుంటున్నామన్న ధీమాతో ఉన్న బీజేపీలోనూ రెబల్స్ బెడద తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని చోట్ల ఆర్ఎస్ఎస్  బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి కాకుండా కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు రెబల్స్ పై సీరియస్ అయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ, నిజామాబాద్, అదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు రెబల్స్ గట్టి పోటీ ఇస్తున్నారు.
 
ఈ రెబల్స్ ప్రభావం వల్ల బహుముఖ పోటీ    నెలకొంది. విజేతను నిర్ణయించే మేజారిటీ ఓట్లు ఈ స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కేవలం 100 నుండి 500 ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే మున్సిపల్ వార్డుల్లో, ఈ రెబల్స్ చీల్చే 50 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తాయి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోయి, స్వతంత్రులు కింగ్ మేకర్లుగా లేదా విజేతలుగా అవతరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ రెబల్స్ ఎవరి కొంప ముంచుతారో, ఎవరికి వరం అవుతారో తేలిపోనుంది.  

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget