అన్వేషించండి

Telangana Municipal Elections 2026: రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు చేసినదెంత? - ఏమని ఓట్లడుగుతున్నారు?

Congress : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ పట్టణ ప్రగతి గురించి కాకుండా పూర్తిగా రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ అసలు పట్టణాలకు ఏం చేసింది?

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రచార వేడి ఊపందుకుంది.  ఈ సమయంలో   గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఓటర్లు బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల అభివృద్ధిపై రెండు ప్రభుత్వాల ప్రాధాన్యతలు, అమలు చేసిన కార్యక్రమాల్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.  

బీఆర్‌ఎస్ పట్టణ ప్రగతి  - మౌలిక వసతులపై ఫోకస్ 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం  పట్టణ ప్రగతి పేరుతో ఒక క్రమబద్ధమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రధానంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, పచ్చదనం  కోసం హరితహారం,  మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా పనిచేశారు. ప్రతి మున్సిపాలిటీకి ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు నిర్మించడం ద్వారా పట్టణాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. నిరంతర నిధుల విడుదల ద్వారా మున్సిపల్ కార్మికుల వేతనాలు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాల్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

రేవంత్ సర్కార్  రీఫార్మ్స్  - హైడ్రా, మూసీ ప్రక్షాళన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ అభివృద్ధిని   భిన్న కోణంలో చూస్తోంది. ముఖ్యంగా   చెరువుల ఆక్రమణలను తొలగించడం, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం రేవంత్ ప్రభుత్వ మార్క్ నిర్ణయంగా మారింది. అలాగే, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్‌ఎస్ వసతులపై దృష్టి పెడితే, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రణాళికలు,  పర్యావరణ పరిరక్షణపై మొగ్గు చూపుతోంది. అయితే కాంగ్రెస్ చేపట్టినవి ప్రధానంగా హైదరాబాద్‌కు సంబంధించినవే. ఇతర మున్సిపాలిటీలకు ప్రత్యేకమైన ప్రణాళికలేమీ అమలు చేయలేదు. 

కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు ! 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిధుల విడుదలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం వదిలివెళ్లిన పెండింగ్ బిల్లుల భారం మున్సిపాలిటీలపై ఉండటంతో కొత్త పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఇందిరమ్మ కమిటీల  ద్వారా వార్డుల వారీగా అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని, ప్రజా పాలన ద్వారా ఫిర్యాదులను పరిష్కరించాలని రేవంత్ ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో అధికారులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో పట్టణ ప్రగతి జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రజా పాలన  పేరుతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లింది.  ఉచిత బస్సు ప్రయాణం ,  ఉచిత విద్యుత్  వంటి గ్యారెంటీలు పట్టణ మధ్యతరగతి ప్రజలపై సానుకూల ప్రభావం చూపాయని ప్రభుత్వం భావిస్తోంది.  

ఎవరు బాగా చేశారని ప్రజలు అనుకుంటారు? 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి నిత్యం ఎదుర్కొనే సమస్యలనే ప్రాతిపదికగా తీసుకుంటారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన పార్కులు, మార్కెట్లను కాంగ్రెస్ ఎలా నిర్వహిస్తోంది.. రేవంత్ రెడ్డి తెచ్చిన కొత్త సంస్కరణలు తమ జీవితాలను ఎలా మారుస్తాయి  అనే అంశాలను ప్రజలు పోల్చి చూస్తున్నారు. గత పదేళ్ల  అభివృద్ధి  వర్సెస్ ప్రస్తుత రెండేళ్ల "మార్పు" మధ్య ఈ ఎన్నికల పోరు సాగనుంది. ప్రజల ఓటింగ్ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా.. ఈ అంశంలో మాత్రం ప్రజల మధ్యచర్చలు జరుగుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget