Facebook నుంచి డబ్బు సంపాదించడం ఎలా?

Published by: Geddam Vijaya Madhuri

ముందుగా Facebook పేజీని బిజినెస్ పేజ్గా మార్చాలి. Facebook నియమాల ప్రకారం.. మీ పేజీలో కనీసం 5,000 మంది ఫాలోవర్లు ఉండాలి.

గత 60 రోజులలో మీ వీడియోలు మొత్తం కలిపి 60,000 నిమిషాల వ్యూస్ పొందాలి.

మీ పేజీలో కనీసం 5 చురుకైన వీడియోలు ఉండాలి. అవి కూడా మీరు స్వయంగా చేసినవి అయి ఉండాలి.

Facebook వినియోగదారుడి వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Facebook లో స్వీయ కంటెంట్ మాత్రమే ఉండాలి. అసభ్యకర లేదా హింసను ప్రేరేపించే వీడియోలు ఉండకూడదు.

మీరు తరచుగా రీల్స్ చేస్తే.. Facebook అందించే 'Ads on Reels' రిక్వెస్ట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

మీ అనుచరులు మీకు 'STAR' పంపడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. దీని కోసం గత 30 రోజులలో కనీసం 500 మంది అనుచరులు ఉండాలి.

మీరు మీ పేజీలోని 'వృత్తిపరమైన డాష్బోర్డ్'కి వెళ్లి 'డబ్బు ఆర్జించడం' విభాగాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.

అర్హత సాధించిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ వివరాలను Facebook'Payout Settings'లో నమోదు చేయాలి.