అన్వేషించండి

Hyderabad Crime News: పెళ్లి కావడం లేదని హుసేన్‌సాగర్‌లో దూకి మహిళా టెకీ ఆత్మహత్య

Hyderabad Crime News | తన తల్లికి మానసిక పరిస్థితి బాగాలేదని, పెళ్లి తరువాత తనతో పాటు ఉంటుందని చెప్పడమే టెకీ పెళ్లికి అడ్డంకిగా మారింది. చివరికి ఆమె హుసేన్‌సాగర్‌లో దూకి సూసైడ్ చేసుకుంది.

హైదరాబాద్: తల్లిపై ఉన్న ప్రేమ, బాధ్యత ఒకవైపు.. తన వివాహం కావడం లేదనే వేదన మరోవైపు.. ఆ యువతిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయి. తల్లికున్న వైకల్యం కారణంగా తన వివాహం జరగడం లేదని భావించిన ఓ యువతి మనస్తాపానికి లోనై ప్రాణాలు తీసుకుంది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అసలేం జరిగిందంటే..

మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి అనే 26 ఏళ్ల యువతి ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. ఆమెకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. మరోవైపు మతిస్థిమితం లేని తల్లి సరస్వతి బాధ్యతలు విజయలక్ష్మి  చూసుకునేది. వీరు కూకట్‌పల్లి పరిధిలోని మైత్రినగర్‌లో నివాసం ఉంటున్నారు.

తల్లి కోసం పరితపించిన కూతురు.. కానీ

ఐటీ ఉద్యోగిని విజయలక్ష్మికి ఇటీవల పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే, తన తల్లి పరిస్థితినిని వివరించడంతో పాటు, ఎవరూ ఆమెను చూసుకునేవారు లేరని, పెళ్లి తర్వాత కూడా తనతోనే ఉంటుందని పెళ్లి సంబంధాల సమయంలో చెప్పేది. అయితే, ఆమె తల్లి కూడా తమ వద్దే ఉండటానికి ఎవరూ ఒప్పుకోలేదు. దాంతో పెళ్లి సంబంధాలు రద్దు అవుతూ వస్తున్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా తనకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, తనకు వివాహం కావడం లేదని ఆమె మనోవేదనకు గురైంది. తల్లికి అన్నీ తానై సేవలు చేస్తున్నప్పటికీ, తన భవిష్యత్తు గురించి ఆలోచించి కుంగిపోయింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది, కానీ ఎంతకీ తిరిగి రాలేదు.

హుసేన్‌సాగర్‌లో విషాదాంతం

విజయలక్ష్మి అదృశ్యంపై ఆమె బంధువు అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హుసేన్‌సాగర్‌లో ఒక యువతి మృతదేహం తేలిందని లేక్ పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ మృతదేహం టెకీ విజయలక్ష్మిదేనని నిర్ధారించారు. తల్లి కోసం ఎంతో తపించిన యువతి చివరకు తల్లి అనారోగ్యమే తన పెళ్లికి అడ్డంకిగా మారిందని, తనతో పాటు ఆమె ఉండేందుకు ఎవరూ ఒప్పుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget