X

Mulugu: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రే హౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

FOLLOW US: 

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పేరూరు సమీపంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ రోజు (అక్టోబరు 25) తెల్లవారు జామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఏకే 47 ఆయుధాలను సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఈ మావోల్లో ఓ అగ్రనేత ఉన్నారని భావిస్తున్నారు. 

Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !

ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రే హౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ ధ్రువీకరించారు. పేరూరు పోలీస్​స్టేషన్ పరిధిలోని తాళ్లగూడెం, టేకులగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు ఏఎస్పీ గౌస్ అలం తెలిపారు.

మృతిచెందిన ముగ్గురిలో తొలుత ఇద్దరు మావోయిస్టులను గుర్తించారు. వారిని బద్రు అలియాస్ కల్లు అనే వ్యక్తిని ఛత్తీస్‌ఘడ్‌లోని దక్షిణ బస్తర్ డివిజన్ మావోయిస్టు నేతగా గుర్తించారు. మరో వ్యక్తిని మహారాష్ట్ర గడ్చిరోలి డివిజన్ మావోయిస్టు నేత కమ్మగా గుర్తించారు.

Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

అది బూటకపు ఎన్‌కౌంటర్: సీపీఐ మావోయిస్టు పార్టీ
ములుగు జిల్లా టేకుల గూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా ప్రకటించారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి తమ ప్రభుత్వం గొప్పగా చేసిందని చెప్పుకుంటుందని అన్నారు. తెలంగాణ అడవుల్లో నెత్తురోడిస్తూనే మరోపక్క కల్లబొల్లి మాటలతో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ లేఖలో తెలిపారు.

Also Read : దగ్గరపడుతున్న హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ! ప్రస్తుతానికి ఇవీ అభ్యర్థుల బలాలు.. బలహీనతలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Three Maoists death Mulugu Maoists death Telangana Maoists death Chattisgarh telangana Boarder

సంబంధిత కథనాలు

Ganja Smuggling: ఏపీ దాటేశారు తెలంగాణలో దొరికేశారు... టైల్స్ లారీలో రూ.1.60 కోట్ల గంజాయి రవాణా

Ganja Smuggling: ఏపీ దాటేశారు తెలంగాణలో దొరికేశారు... టైల్స్ లారీలో రూ.1.60 కోట్ల గంజాయి రవాణా

Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన జీపు, నలుగురి దుర్మరణం

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన జీపు, నలుగురి దుర్మరణం

Tadepalli Cheddi Gang : తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

Tadepalli Cheddi Gang :  తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..!  ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

Banjara Hills: బంజారాహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

Banjara Hills: బంజారాహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు.. 

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

Telangana Health Department: తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు లేవు

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

December 6 Cricketers Birthday: ఈ ఒక్క రోజే టీమ్‌ఇండియాలో ఐదుగురు క్రికెటర్ల బర్త్‌డే.. ఎవరో తెలుసా?

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్

Clearest Sun Photo: మండే అగ్ని గోళంలా కనిపిస్తాడు... సూర్యుడి అత్యంత స్పష్టమైన ఇమేజ్ తీసిన ఖగోళ ఫొటో గ్రాఫర్