By: ABP Desam | Updated at : 12 Oct 2021 10:33 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలుగు అకాడమీ స్కాం(ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కాంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో ఈ స్కాం కీలక నిందితుడు సాయి కుమార్ గత పదేళ్లలో రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లకు సంబంధించిన రూ.15 కోట్ల డిపాజిట్లను పక్కదారి పట్టించి స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీకి స్కాంలో రూ. 64.5 కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించు నిందులు వాటాలుగా పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత పదేళ్లలో సుమారు రూ. 200 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించి పంచుకున్నట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. సాయి కుమార్ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ కంపెనీ టూ స్వాహా
తెలుగు అకాడమీ కేసులో ప్రధాన నిందితుడు సాయి, తన అనుచరులతో కలిసి రూ.కోట్లలో ప్రభుత్వ సంస్థల ఎఫ్‌డీలు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాయికుమార్, అతని ముఠాపై ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మరో 2 ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీలు సైతం సాయి ముఠా కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. స్వాట్ కంప్యూటర్స్ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహించిన సాయి కుమార్ చెన్నైకి చెందిన కొంత మందితో కలిసి ఈ రూట్ లో అడుగుపెట్టాడు. బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుని ఎఫ్‌డీల స్వాహా చేయడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగులకు కమీషన్లు ఆశ చూపి ఎఫ్‌డీల సొమ్మును గోల్ మాల్ చేయడం ప్రారంభించాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి.
కోర్టులో హాజరు
సాయి కుమార్ పాటు 9 మంది నిందితుల కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితులు పంచుకున్న వాటాలపై దర్యాప్తు కోసం 9 మంది నిందితులను మరో నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. నిందితులు వినయ్ కుమార్, రమణారెడ్డి, భూపతిలను నాంపల్లి కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 16వ తేదీన నిందితులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించనున్నారు.
Also Read: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్
Warangal Crime : చెత్త సేకరణ ముసుగులో చోరీలు, ముగ్గురు కిలేడీలు అరెస్టు
Vijayawada: పక్కవీధి మహిళతో భర్త ఆరేళ్లుగా అఫైర్, ఊహించని షాక్ ఇచ్చిన భార్య!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?