(Source: ECI/ABP News/ABP Majha)
Telugu Academy Scam: తెలుగు అకాడమీ ఉద్యోగులు - బ్యాంక్ స్టాఫ్ కలిసి చేసిన దోపిడి ! ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అకాడమీ ఉద్యోగులు, బ్యాంక్ స్టాఫ్ కలిసి దారి మళ్లించారని పోలీసులు గుర్తించారు. కెనరా బ్యాంక్ మేనేజర్ సహా కొంతమందిని అరెస్ట్ చేశారు.
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో బ్యాంక్ ఏజెంట్ సాయికుమార్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు కీలకమైన వివరాలను బయట పెట్టారు. నిందితులంతా కుమ్మక్కాయి.. కోట్లు కొట్టేసి పంచుకోవడమే కాకుండా బ్యాంకుకు కూడా కమిషన్ ఇచ్చారు. వీరి అత్యంత నేర్పుగా రూ. కోట్లు మళ్లించడం వెనుక పెద్ద హస్తాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు అకాడమీకి సంబంధించి అకౌంట్స్ అధికారి రమేష్‌కు స్కాం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన సహకారంతోనే ముఠా రూ. కోట్ల నిధులను మళ్లించింది. మొత్తం రూ.64.5 కోట్ల నిధులను గోల్‌మాల్ చేసినట్లుగా పోలీసులు లెక్కలు తేల్చారు. కార్వాన్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 26కోట్లు, సంతోష్ నగర్ బ్రాంచి నుంచి రూ.11 కోట్లు , చందనగర్ కెనరా బ్యాంక్ నుంచి రూ. 6 కోట్లు నకిలీ పత్రాలతో దారి మళ్లించారు. ఈ కుంభకోణంలో సాయికుమార్ కీలక నిందితుడు. ఇతనిపై గతంలో 3 కేసులున్నాయని పోలీసులు ప్రకటించారు.
సాయి కుమార్ బ్యాంక్ ఎజెంట్‌గా పని చేస్తున్నారు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఏజెంట్లు రాజ్‌కుమార్, వెంకట్‌ల హస్తం కూడా ఉంది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నీ తెలిసి కూడా డబ్బులు మళ్లించడానికి సహకరించిన చందానగర్ కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను అరెస్టు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. మరో 9 మందిని అనుమానితులుగా భావిస్తున్నారు. వారి గురించి తదుపరి పరిశోధన జరుగుతోదంి. వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.
Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !
ఓ పక్కా ప్రణాళిక ప్రకారం రూ. కోట్ల నగదు మళ్లింపు జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముఠా మళ్లించడం ప్రారంభించారు. డబ్బులన్నీ ఆగ్రసేన్ బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. సాయి కుమార్‌కి ఈ డబ్బులో అధిక శాతం వాటా తీసుకున్నారు. మిగిలిన వారు ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. ఈ డబ్బుల్లో చాలా వరకూ వారు డ్రా చేశారు. వారు ఆస్తులు కొనుగోలు చేయడం.. అప్పులు ఇవ్వడం వంటివి చేశారు. ఖాతాల్లో ఉన్న మొత్తాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కొసమెరుపేమింటే...మార్కంటైల్ బ్యాంక్‌కు 10శాతం కమిషన్ ఇచ్చారు. సూత్రధారులను గుర్తించి.. మొత్తం సొమ్మును రికవరీ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి