(Source: ECI/ABP News/ABP Majha)
Jagityal Crime : కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !
కేటీఆర్‌తో పాటు ప్రముఖులతో దిగిన ఫోటోలను చూపించి పేదలను మోసం చేశాడో ప్రబుద్ధుడు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కనిపించకుండా పోయాడు. జగిత్యాల జిల్లాలో ఈ మోసం జరిగింది.
ఫోటోలే అతని పెట్టుబడి ! మాయ మాటలే వ్యాపారం ! కాస్త నమ్మారా ఇక అంతే సంగతులు..! కూలీనాలీ చేసుకునే వాళ్లను కూడా వదలకుండా నిండా ముంచేసి డబ్బులు వసూలు చేసి పారిపోవడమే అతని నైజం. జగిత్యాలో రేగొండ నరేష్ అనే వ్యక్తి చేసిన మోసానికి పెద్ద ఎత్తున దిగువ మధ్యతరగతి ప్రజలు నిండా మునిగిపోయారు. ఆస్తులు తాకటచ్టు పెట్టి మరీ ఇచ్చిన డబ్బులతో రేగొండ నరేష్ పరారయ్యాడు. మీరే కాపాడాలంటూ బాధితులంతా ఎస్పీ సింధూశర్మకు మొర పెట్టుకున్నారు.
Also Read : నగరం నడిబొడ్డున మర్డర్ అటెంప్ట్... పట్టపగలే కత్తులతో దాడి... పాతకక్షలే దాడికి కారణమా?
జగిత్యాలలో నివాసం ఉండే రేగొండ నరేష్ టిప్ టాప్‌గా తయారై టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా తిరుగుతున్నట్లుగా షో చేస్తూండేవాడు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను ప్రత్యేకంగా ప్రదర్శించుకునేవాడు. మాటకు ముందు.. తర్వాత కేటీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చేవారు. అలాగే ఉన్నాతాధికారులతో దిగిన ఫోటోలను కూడా చూపించి.. తాను కొంత మందికి బినామీ అన్నట్లు చెప్పుకున్నాడు. ముఖ్యంగా కేటీఆర్‌కు తాను బినామీనని.. మంత్రి తనకు ఓ పెద్ద వెంచర్ అప్పగించాడని..తానే మార్కెటింగ్ చేస్తున్నానని నమ్మించాడు.
Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే.
పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు వస్తాయని నమ్మించాడు. ఆ వెంచర్‌కు డబ్బులు కావాలని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. నమ్మిన వాళ్లందరి ఆస్తులను కూడా తాకట్టు పెట్టించాడు. ఇళ్లు, పొలాలు దేన్నీ వదిలి పెట్టలేదు. వారికి మరిన్ని ఆశలు చూపించి వారి బంధువులతోనూ పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. అంతే కాదు యాభై మందికి ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. తీరా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా.. రేగొండ నరేష్ కనిపించకుండా పోయాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వాళ్లకు గుండెగి నంత పనయింది.
Also Read: బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
ఎన్ని రోజులు చూసినా రాకపోవడంతో బాధితులంతా ఎస్పీ సింధూశర్మను కలిశారు. న్యాయం చేయాలని కోరారు. తమలో ఎవరూ కూడా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా లేరని..అందరూ కూలీనాలీ చేసుకునే వారమేనని.. ఇప్పుడు తమకు ఉన్నదంతా ఊడ్చుకుపోయాడని పట్టుకుని తమ సొమ్మ తమకు ఇప్పించాలని కోరారు. లేకపోతే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని మొర పెట్టుకున్నారు. ఏకంగా కేటీఆర్ పేరు చెప్పే మోసం చేయడంతో ఈ అంశంపై పోలీసులు కూడా సీరియస్‌గా విచారణ జరుపుతున్నారు. మోసగాడు రేగొండ నరేష్‌ను పట్టుకునేందుకు ప్త్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు.
Also Read : అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి