Cyberabad Police: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..
సైబర్ నేరంపై పోలీసులు రూపొందించిన మీమ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే ఫేమస్ డైలాగ్‌తో మీమ్ చేసి ట్వీట్ చేశారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా మీమ్స్ తయారు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ట్రెండ్‌కు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు. కొన్ని మీమ్స్ అయితే, మీమర్స్ చేసే వాటికి దీటుగా ఉంటున్నాయి. బహుశా మీమ్స్ చేసేవారిని ఇందుకోసం నియమించుకున్నారా? అనే సందేహం కూడా వస్తుంది. తాజాగా సైబర్ నేరంపై పోలీసులు రూపొందించిన మీమ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
Also Read: పద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్
ఫేస్‌బుక్‌లో ఎన్నో నకిలీ అకౌంట్లతో నేరాలు జరిపేందుకు దుండగులు ఎప్పుడూ పొంచి ఉంటారు. అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్‌లు క్రియేట్ చేసి యువకులకు గాలం వేస్తుంటారు. చాటింగ్‌లతో వలపువల విసిరి బుట్టలో వేస్తుంటారు. చివరికి కట్టుకథలు చెప్పి అందినకాడికి దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు వెలుగులోకి వచ్చాయి. ఆఖరికి తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు అవతలి వ్యక్తి అమ్మాయి కాదు.. అబ్బాయి అని తెలుసుకొని అవాక్కవుతుంటారు. ఫేస్ బుక్, ఫోన్లలో ఇంటర్నెట్ వచ్చిన మొదట్లో ఈ తరహా నేరాలు బాగా జరిగేవి. ఆ తర్వాత అవగాహన పెరిగి కాస్త తగ్గాయి మళ్లీ ఇలాంటి పుంజుకుంటుండడంతో పోలీసులు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..
అందులో భాగంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్‌లో ఫన్ పోస్ట్ ఒకటి చేశారు. మహేష్ బాబు అతడు సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ మీమ్ చేశారు. దీనిద్వారా ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సందేశం ఇచ్చారు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్ కూడా చేశారు.
ఆడు మగాడ్రా బుజ్జి..!
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) October 4, 2021
Beware of #Fake #Facebook profile frauds @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @actorbrahmaji pic.twitter.com/oph4oL7Aoe
Also Read: మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!
Also Read: Gold Smuggling: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి