KTR Felicitation: మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!
నిబంధనలు ప్రజలకైనా, ప్రజాప్రతినిధులకైనా ఒక్కటే. రాంగ్ రూట్ లో వస్తే ఫైన్ వేయాల్సిందే. రాంగ్ రూట్ వచ్చిన మంత్రి కేటీఆర్ వాహనానికి ఫైన్ వేశారు ట్రాఫిక్ సిబ్బంది. దీనిపై మంత్రి ఎలా స్పందించారంటే.
రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాను విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని కేటీఆర్ అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా....నిబంధనలు అందరికీ ఒకటే అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాను విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.
Also Read: TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!
ట్రాఫిక్ సిబ్బందికి అభినందనలు
మెహదీపట్నం బాపూ ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ చలాను విధించారు. వీరిని మంత్రి శాలువా కప్పి అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను సైతం చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సరైన సందేశం అందించేందుకు ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని, పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు.
Also Read: పద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్
అసలేం జరిగింది..
మంత్రి కారు ఇలా రాంగ్ రూట్‌లో వచ్చినా ట్రాఫిక్ పోలీసు మాత్రం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. రాంగ్‌రూట్‌లో వస్తున్న మంత్రి కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్‌ఐ అడ్డుకున్నారు. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా శనివారం మెహదీపట్నం సమీపంలోని బాపూఘాట్ వద్ద నివాళులర్పించేందుకు కేటీఆర్ వచ్చారు. ఆ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ అడ్డుకున్న సమయంలో కారులో మంత్రి కేటీఆర్ లేరు. ఘాట్ వద్ద బాపూజీకి నివాళులు అర్పించేందుకు గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అక్కడికి వచ్చారు. వారికి కేటీఆర్ వీడ్కోలు పలుకుతుండగా మంత్రి వెళ్లేందుకు కారు అక్కడికి తీసుకురావాలంటూ డ్రైవర్‌కు పార్టీ నేతలు తెలిపారు. ఇద్దరు గవర్నర్లు అక్కడి నుంచి వెళుతుండటంతో ఓ వైపు రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో మంత్రి కారు రాంగ్‌రూట్‌లో వచ్చింది.
Also Read: పోలీసులతో వాగ్వాదం.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ ఛార్జ్.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన నిరుద్యోగ సైరన్
రాంగ్ రూట్ లో వచ్చిన కారు
ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య గమనించారు. కారును ఆపి బానెట్ మీద చరిచారు. రాంగ్ రూట్‌లో ఎందుకు వస్తున్నావు? వెనక్కి వెళ్లు? అని డ్రైవర్‌కు ట్రాఫిక్ ఎస్‌ఐ సూచించారు. అది మంత్రి వాహనం అని అక్కడే ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పడంతో అప్పుడు ఎస్‌ఐ వెనక్కి తగ్గారు. అయితే కారును ఆపడాన్ని చూసిన టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు ఉన్నతాధికారులు సర్దిచెప్పడంతో శాంతించారు. మంత్రి కారని గుర్తించకపోవడం వల్లే ఎస్‌ఐ ఆపారని పోలీస్ అధికారులు తెలిపారు.
Also Read: రాంగ్ రూట్‌లో కేటీఆర్ కారు.. ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. చివరికి ఏమైందంటే..