Gold Smuggling: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
ఇటీవలే స్మగ్లర్లు బంగారం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని తరలిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి తీసుకెళ్లాలనుకుని దొరికిపోతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్లంతా.. దుస్తుల్లో అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేశారు. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్ వచ్చారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన వేముల శ్రీనివాస్, అమర్‌గొండ శ్రీనివాస్‌ల నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
ఇటీవలే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. కువైట్ ప్రయాణికుడి నుంచి 763.66గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల మలద్వారంలో బంగారం..
ఇంఫాల్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి దగ్గర 900 గ్రాముల బరువున్న.. సుమారు రూ. 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 909.68 గ్రాముల బరువున్న నాలుగు మెటల్ పేస్ట్ ప్యాకెట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహమ్మద్ షరీఫ్ అనే ఈ ప్రయాణికుడు ఇంఫాల్ నుంచి దిల్లీకి వెళుతూ పట్టుబడ్డాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. మహమ్మద్ షరీఫ్ ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. తనిఖీ సమయంలో వేసిన ప్రశ్నలకు అతను సరైన సమాధానం ఇవ్వలేదు. మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్‌లో అతనికి ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే రిపోర్ట్ ప్రకారం అతని శరీర మలాశయ భాగంలో లోహం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్యాసింజెర్ గోల్డ్ పేస్ట్ ఉన్నట్లు అంగీకరించాడు.
Also Read: ఈ రాశులవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి సమస్యలు పరిష్కారమవుతాయి..ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
Also Raed: నేటి నుంచి రాష్ట్రమంతా ‘స్వేచ్ఛ’ కార్యక్రమం.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి