Prostitution Racket: హైటెక్‌గా భారీ వ్యభిచార దందా.. 75 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు.. నిజాలు తెలిసి అవాక్కైన పోలీసులు
బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసి పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో భారీ సెక్స్ రాకెట్ ఒకటి బయట పడింది. అంతేకాక, ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. ఎందుకంటే అతను ఏకంగా 75 మందిని పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతణ్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలివీ..
ఇండోర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసి పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యభిచార దందా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఏకంగా 75 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ వ్యభిచార కూపం నుంచి ఏకంగా 21 మంది యువతులను రక్షించారు. అయితే, అప్పుడే ఆ వ్యభిచార కూపం నిర్వహిస్తున్న వ్యక్తి పరారయ్యాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: కేటీఆర్ బినామీనని నమ్మించాడు.. కోట్లు కొల్లగొట్టాడు ! జగిత్యాలలో మహా మోసగాడు !
లోతైన విచారణ జరపగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మునిర్ గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్‌లోని జాసుర్‌కు చెందిన మునిర్ అలియాస్ మునిరుల్ అనే వ్యక్తి ఆ దేశానికి చెందిన యువతులను ఈ రొంపిలోకి లాగుతున్నాడు. భారత్‌లో మంచి జీతం ఇచ్చి ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి ఉపాధి పేరుతో యువతులను భారత్‌కు రప్పిస్తున్నాడు. ఇలా వారిని అక్రమంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ మీదుగా భారత్‌లోకి రప్పించి ఈ అక్రమ దందా సాగిస్తున్నాడు.
Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే.
ఈ క్రమంలో సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ.25 వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. అనంతరం బంగ్లాదేశ్ యువతులను ముంబయి, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా మునిర్ వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. ఇలా 200 మంది యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసినట్లు చెప్పారు. మరోవైపు, తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నట్లు మునిర్ విచారణలో చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతయింది. ఈ రాకెట్‌కు సంబంధించిన మూలాలపై పోలీసులు మరింతగా విచారణ జరుపుతున్నారు.