(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Crime: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!
తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ లో మరో ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని నందిని మరణించింది. ఇంటర్ మొదటి సంవత్సవరం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమె స్వస్థలం ఆదిలాబాద్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇటీవల ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. గత ఏడాది మార్చిలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను సెకండియర్ లోకి ప్రభుత్వం ప్రమోట్ చేసింది. సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్టియర్ ఎగ్జామ్స్ ను అక్టోబర్ నిర్వహించింది. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇంటర్ బోర్డు ఈ వ్యతిరేకతను పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించింది. ఈ ఫలితాల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అవ్వడంతో విద్యార్థులు, ఆందోళనకు దిగారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్ అవ్వడం వివాదాస్పదంగా మారింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ సారి 49 శాతానికే పరిమితమయింది. కరోనా టైమ్‌లో విద్యార్ధులు ఎన్నో ఇబ్బందులు పడి పరీక్షలు రాస్తే.. మరీ ఇంత తక్కువ మందిని పాస్ చేస్తారా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ కఠినంగా చేశారనీ బాగా చదివే పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల రోజులే టైమ్ ఇచ్చి పరీక్షలు పెట్టారని ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
Read Also: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
ముగ్గురు విద్యార్థులు బలన్మరణం
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని మనస్తపం చెంది వివిధ ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ అర్సపల్లిలో ఇంటర్ విద్యార్థి యశ్వంత్ (17) ఆత్మహత్యకు చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న యశ్వంత్.. మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. నల్లగొండలోని గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి (16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కొల్లూరి వరుణ్ (19) ఉరి వేసుకుని బలన్మరణం చేసుకున్నాడు.
Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి