Crime News: మంటల్లో కాలిపోతున్న భర్త.. చోద్యం చూస్తూ నుంచున్న భార్య, కొడుకు.. అసలేం జరిగిందంటే..
కొడుకు కల్యాణ్, భార్య సపావత్ బుజ్జి గురువారం మధ్యాహ్నం సపావత్ బాబు మంచంపై పడుకున్న సమయం చూసి అతనిపై పెట్రోలు పోశారు. అనంతరం తగలబెట్టేశారు.
సూర్యాపేట జిల్లాలో అతి కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది. భర్త ఒంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి చంపేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని జువ్విచెట్టు తండాలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జువ్విచెట్టు తండాకు చెందిన సపావత్ బాబు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తుండేవాడు. వచ్చిన డబ్బులతో రోజూ మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్య, కుమారుడికి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో తండ్రి ప్రవర్తన పట్ల కొడుకు కల్యాణ్, భర్త ప్రవర్తన పట్ల భార్య విపరీతంగా విసుగు చెందారు.
దీంతో కొడుకు కల్యాణ్, భార్య సపావత్ బుజ్జి గురువారం మధ్యాహ్నం సపావత్ బాబు మంచంపై పడుకున్న సమయం చూసి అతనిపై పెట్రోలు పోశారు. అనంతరం తగలబెట్టేశారు. పెద్ద ఎత్తున మంటలు వస్తుండటంతో స్థానికులు హుటాహుటిన వచ్చి చూడగా.. మంటల్లో కాలిపోతూ కనిపించాడు. మంటలు ఆర్పాల్సిన తల్లీ కొడుకులు దూరం జరిగి చోద్యం చూస్తుండడాన్ని గమనించారు. వెంటనే స్థానికులు స్పందించి దుప్పటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సతావత్ బాబు పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Also Read: ఈ చోరుడు మహా ముదురు... పోలీసు స్టేషన్ లోనే దొంగతనం... పోలీసుల కన్నుగప్పి బైకులు చోరీ
కొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య
కొడుకు మృతి చెందాడని మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం సూర్యాపేటలో వెలుగు చూసింది. టేకుమట్ల గ్రామానికి చెందిన కందుకూరి బ్రహ్మచారి అనే 24 ఏళ్ల వ్యక్తి సూర్యాపేటలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బ్రహ్మచారికి ఇటీవలే కొడుకు పుట్టాడు. నవంబరు 25న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటి నుంచి బాధపడుతూ, మద్యానికి బానిసయ్యాడు. అప్పుడప్పుడూ మాత్రమే బ్రహ్మచారి పనికి వెళ్లేవాడు. ఈ నెల 3న పని కోసం సూర్యాపేటకు వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు.
ఇంతలో సూర్యాపేటలోని సద్దుల చెరువులో బ్రహ్మచారి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!