Nellore Crime: ఈ చోరుడు మహా ముదురు... పోలీసు స్టేషన్ లోనే దొంగతనం... పోలీసుల కన్నుగప్పి బైకులు చోరీ
పోలీసులు స్టేషన్ కు నిత్యం చాలా మంది కేసు పనుల్లో వస్తుంటారు. అలా రోజు వచ్చే ఓ ఘనుడు. వెళ్తూ ఉత్తచేతులతో ఎందుకు అనుకుని స్టేషన్ లో ఉన్న బైక్ లు పట్టుకెళ్లేవాడు. ఇలా రెండు బైక్ లు కొట్టేశాడు.
ఇడియట్ సినిమాలో అలీ బైక్ సీన్ గుర్తుందా...! అందులో అలీ బైక్ పై ఇసుక మూటను పెట్టుకుని వెళ్తుంటాడు. చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆపితే బీదర్ లో జల్లేందుకు ఇసుక తీసుకువెళ్తున్నా ఖాకీలను అంటూ బురిడీ కొట్టిస్తాడు. చివరకు ఓ పోలీసు అధికారి నేను ఎవ్వరికీ చెప్పను నవ్వు ఏం పట్టుకెళ్లేవాడివో చెప్పమంటే. అప్పుడు రివీల్ చేస్తాడు. బైక్ లు చోరీ చేసేవాడినని చెప్తాడు. ఇలాంటి సీన్ కాకపోయినా ఇంచుమించు అలాంటి ఘటనను రిపీట్ చేసేందుకు ప్రయత్నించాడు ఓ చోరుడు.
Also Read: సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభం... పీఆర్సీతో సహా 71 డిమాండ్లపై చర్చ
ఎవరైనా దొంగతనం చేసి దొరికితే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. కానీ ఇక్కడో తెలివైన దొంగ దొంగతనం చేయడం కోసమే పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసి ఉన్న బైక్ లను దర్జాగా కొట్టేస్తున్నాడు. మొదటిగా ఒక బైక్ చోరీ చేశాడు. ప్లాన్ సక్సెస్ అయ్యిందనుకున్నాడు. పోలీసుల కన్నుగప్పి మరో బైక్ కూడా చోరీచేశాడు. రెండు బైక్ లు ఇలా స్టేషన్ నుంచి మాయం కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నిఘా పెట్టారు దొంగను పట్టారు.
Also Read: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...
పాత బైక్ లు పక్కాగా చోరీ
సహజంగా బైక్ ని నడుపుకుంటూ వెళ్లేవారిని చూస్తే పెట్రోల్ అయిపోయిందనుకుంటాం, లేదా బైక్ రిపేర్ కు వచ్చిందనుకుంటాం. సరిగ్గా ఇదే పాయింట్ ఆధారంగా ఓ ఘరానా దొంగ పోలీస్ స్టేషన్లో బైక్ లు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. వివిధ కేసుల్లో పోలీసు స్టేషన్ లో ఉంచిన బైక్ లపై కన్నేసి వాటిని చోరీ చేస్తున్నాడు. ఒకటికి రెండుసార్లు బైక్ లు నడిపించుకుంటూ వెళ్లడం పోలీసులు చూసినా వదిలేశారు. తీరా స్టేషన్లోని బైక్ లు మాయమవ్వడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నిఘా పెట్టి బైక్ దొంగను పట్టుకున్నారు.
Also Read: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం
పోలీస్ స్టేషన్ కే కన్నం
నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రెండు బైక్ లు చోరీకి గురైన ఘటనలో పోలీసులు రాజేంద్ర కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కావలి పట్టణంలో పలువురు లాయర్ల వద్ద గమస్తాగా పనిచేస్తూ రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి వెళ్తుండేవాడు రాజేంద్ర కుమార్. ఈ నేపథ్యంలో ఎవరికా అనుమానం రాకుండా సెంట్రీ భోజనానికి వెళ్లిన సమయంలో బైక్ లు దొంగలించేవాడు. పోలీసులు చూసినా తెలిసిన వ్యక్తి కావడంతో అనుమానం రాలేదు. తీరా ఆడిటింగ్ సమయంలో బైక్ లు పోయినట్టు గుర్తించి నిఘా పెట్టి రాజేంద్రకుమార్ ని అరెస్ట్ చేశారు. బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.