అన్వేషించండి

Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

వరంగల్ జిల్లాలో సంచలనమైన ఫైనాన్షియర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

గత ఏడాది నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్య కేసును వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో ఫైనాన్షియర్ కోక వేంకటేశ్వరరావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ పరిచయంతో గురుమూర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన సొంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వరరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. Warangal Crime: వరంగల్ ఫైనాన్షియర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... హత్య కేసులో అద్దెకు ఉంటున్న వ్యక్తి హస్తం... పోలీసులు ఎలా ఛేదించారంటే..?

Also Read: 'బుల్లి బాయ్'ను పట్టేసిన పోలీసులు.. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకం

ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తి హస్తం

అలాగే గురుమూర్తి తన రెండో కుమార్తె కాలేజీ ఫీజులు, వివాహం కోసం తన ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని, రూ.15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ఇందుకోసం తన ఇంటి దస్తావేజులు ఇవ్వాలని గురుముర్తి వెంకటేశ్వరరావు ఇవ్వాలని కోరాడు. అయితే తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని చెప్పడంతో వెంకటేశ్వరావుపై గురుమూర్తి ద్వేషం పెంచుకున్నాడు. చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంకటేశ్వర రావు ఇంటిలో కిరాయికి ఉంటున్న మరో వ్యక్తి నీలం శ్రీనివాస్ ఆర్థిక లావాదేవీల గొడవలతో యాజమానిపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో ఉన్న ఆర్థిక లావాదేవీల గోడవలు సమసిపోవాలంటే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వెంకటేశ్వర రావు హత్య చేసేందుకు అవసరమైన డబ్బు ఖర్చు చేసేందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. వెంకటేశ్వర రావును హత్య చేసేందుకు ఆకునూరి మహరాజ్ తో పాటు మరికొందరితో గురుమూర్తి, శ్రీనివాస్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు.       

Also Read:  'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

ప్లాన్ ప్రకారం హత్య

ఫైనాన్స్ డబ్బులు వసూళ్ల కోసం  వెంకటేశ్వరరావు  దూపకుంట వస్తున్నట్లుగా తెలుసుకుని తూర్పుకోటకు వెళ్లే మార్గంలోని తాటివనంలో హత్యకు ప్లాన్ వేశారు. అనుకున్నట్లే గత నవంబర్  21న రాత్రి 8 గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ వెంకటేశ్వర రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటివనం వైపు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఆటోలో కాపుకాస్తున్న గురుమూర్తితో సహ మిగతా నిందితులు వేంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో ఉన్న రూ. పది వేల నగదును చోరీ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి సూచనల మేరకు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. గురువారం ఉదయం ఆర్థిక లావాదేవీలపై నిందితులందరూ చర్చించేందుకు రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget