అన్వేషించండి
Advertisement
Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!
దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది.
దేశంలో కరోనా టాప్ గేర్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది.
19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్‌తో మృతి చెందారు.
- డైలీ పాజిటివిటీ రేటు: 6.43%
- యాక్టివ్ కేసులు: 2,85,401
- మొత్తం రికవరీలు: 3,43,41,009
- మొత్తం మరణాలు: 4,82,876
- మొత్తం వ్యాక్సినేషన్: 148.67 కోట్ల డోసులు
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు.
మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి.
కొత్త కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,57,032కు చేరింది. మరణాల సంఖ్య 1,41,581కి చేరింది.
200 మందికి పైగా వైద్యులకు
వాణిజ్య రాజధానైన ముంబయిలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత మూడు రోజుల్లో ప్రభుత్వాసుపత్రులకు చెందిన 220 మంది వైద్యులకు కరోనా సోకినట్లు తేలింది.
దిల్లీ..
దిల్లీలో ఈరోజు 14 వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
మొబైల్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement