Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...
సచివాలయాల్లో చేపలు విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. మినీ రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటుచేసి చేపలు విక్రయాలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రా బ్రాండ్ పేరిట గ్రామ, వార్డు సచివాలయాల్లో మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఈ రిటైల్ అవుట్ లెట్ల ద్వారా చేపలు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాలకొండ, శ్రీకాకుళం, పలాసల్లో మూడు హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ హబ్ ల ద్వారా 30 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో రిటైల్ అవుల్‌లెట్లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రైతుబజారులో స్టాళ్లు ఖాళీగా ఉంటే చేపలు విక్రయించేందుకు అద్దెకు ఇస్తామని మార్కెటింగ్‌శాఖ జేడీ శ్రీనివాసరావు చెప్పారు.
Also Read: సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల చర్చలు ప్రారంభం... పీఆర్సీతో సహా 71 డిమాండ్లపై చర్చ
మొబైల్ సర్వీసు ద్వారా చేపల విక్రయాలు
మినీ అవుట్ లెట్ల ద్వారా చేపలు విక్రయించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. మొబైల్ సర్వీసుల ద్వారా చేపలను విక్రయించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతు బజార్లలో స్టాల్స్ ఖాళీగా ఉంటే చేపలను విక్రయించేందుకు అద్దెకు కేటాయించాలన్నారు. చేపలను ఆంధ్రా బ్రాండ్ పేరిట ప్రజలకు పోషకాహారం అందించేందుకు చేపల విక్రయాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఖాళీ స్థలాలు మున్సిపల్, పంచాయతీ, మార్కెట్ యార్డుల్లో లబ్ధిదారులకు అద్దెకు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రింగ్ వలల సమస్య ఉంటే పరిష్కరించేందుకు మత్స్యకారులతో సమావేశమవ్వాలని అధికారులను ఆదేశించారు.
Also Read: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..
లబ్దిదారులకు రుణాలు
టిడ్కో గృహాలకు సంబంధించి లబ్దిదారులకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధికారులను ఆదేశించారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన లబ్ధిదారులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు గృహాలను అప్పగించి రుణాలను ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్‌ల్లో గృహనిర్మాణాలు వేగంగా ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ చెప్పారు.
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !