Kakinada: ఫ్రెండ్ చెల్లిపై యువకుడు పదే పదే అఘాయిత్యం.. అబార్షన్ చేయించి మరీ.. ఆరేళ్లకు కోర్టు తీర్పు, శిక్ష ఏంటంటే..
కోర్టు విచారణలో నిందితుడు పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువు కావడంతో కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు బుధవారం తీర్పు వెలువరించారు.
నయవంచకులు నానాటికీ చెలరేగిపోతున్నారు.. అమాయకంగా కనిపించే టీనేజ్ బాలికలనే టార్గెట్‌గా చేసుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుని ఆపై అవసరం తీరాక వదిలించుకుంటున్నారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఓ నయవంచుకుడి మాయమాటలకు లొంగిపోయిన ఓ గిరిజన నర్సింగ్ విద్యార్థిని గర్భం దాల్చింది. స్నేహితుడి సోదరి అని కూడా చూడకుండా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ నయా వంచకుడు ఆపై ఆమెను గర్భవతిని చేశాడు. ఆ తరువాత ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందోనని ఆమెకు బలవంతంగా టాబ్లెట్లు మిగించి గర్భవిచ్ఛిత్తి చేశాడు. కంగారు పడొద్దని పెళ్లి చేసుకుంటానని మళ్లీ నమ్మించిన మోసగాడు ఆ తరువాత కూడా పలు సార్లు అత్యాచారం చేశాడు.
రోజులు గడుస్తున్నా అదిగో చేసుకుంటాను.. ఇదిగో చేసుకుంటానని కాలయాపన చేసిన వంచకుడు ఆతరువాత ప్లేటు ఫిరాయించాడు.. దిక్కున్న చోటుకు వెళ్లి చెప్పుకో.. నిన్ను పెళ్లి చేసుకోనని ఖరాఖండీగా చెప్పేశాడు.. చివరకు ఆమె పోలీసులసు ఆశ్రమించింది. ఆరేళ్లకు.. అంటే ఇప్పుడు బాధిత యువతికి న్యాయం జరిగింది.. తాజాగా కాకినాడ ఫోక్సో స్ఫెషల్ కోర్టు వంచకుడికి పదేళ్లు జైలుశిక్ష విధించింది.
ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి చర్చివీధికి చెందిన సురబోయిన పవన్‌కుమార్ తన స్నేహితుడి సోదరితో పరిచయం పెంచకుని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె 2015లో కాకినాడలో నర్సింగ్ చదివేందుకు వెళ్లగా అక్కడికి తరచూ వెళ్లి ఆమెను కలిసేవాడు. ఈక్రమంలోనే ఆ యువతి 2015లో గర్భం దాల్చింది. తరువాత పెళ్లి చేసుకుందామని నమ్మించి బలవంతంగా గర్భవిచ్చిత్తి మాత్రలు మింగించాడు. 2016లో పెళ్లి చేసుకందామని యువతి ప్రపోజల్ పెట్టగా మళ్లీ కాలయాపన చేసి చివరకు దిక్కున్నచోట చెప్పుకోమని మోసం చేయడంతో ఆ యువతి 2016లో మారేడుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడినందకు ఐపీసీ 378తోపాటు ఐపీసీ 417, 312, 315, 506 సెక్షన్లతో ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
కోర్టు విచారణలో నిందితుడు పవన్ కుమార్ నేరం చేసినట్లు రుజువు కావడంతో కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు బుధవారం తీర్పు వెలువరించారు. నయవంచకుడికి పదేళ్లు జైలు, రూ.10 వేలు జరిమానా విధించారు. ఏపీపీ ఎండీ అక్బర్ ఆజం ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
Also Read: Suryapet: సూర్యాపేటలో కిరాతక హత్య, బురదలో పడేసి.. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి..
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !