Rangareddy News: స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి - స్కూల్ పీఈటీలకు తల్లిదండ్రుల దేహశుద్ది, మొయినాబాద్ లో ఘటన
Telangana News: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో తీవ్ర విషాదం జరిగింది. స్కూల్ స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Second Class Student Died In School Swimming Pool In Moinabad: రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలంలో తీవ్ర విషాదం జరిగింది. ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో సమ్మర్ క్యాంప్ అంటూ స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన గాండ్ల శివశౌర్య (7) స్కూల్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా శుక్రవారం స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
పీఈటీలకు దేహశుద్ది
అయితే, విద్యార్థి మృతి విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ పీఈటీలకు (PETs) దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Viral News: ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి, రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి