అన్వేషించండి

Hyderabad News: ఆర్ఎస్ఐ మృతి - మిస్ ఫైరా లేక ఆత్మహత్యా?

Telangana News: హైదరాబాద్ పాతబస్తీ ఓ ఆర్ఎస్ఐ మృతి కలకలం రేపింది. ఇది ఆత్మహత్యా లేక గన్ మిస్ ఫైర్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Rsi Death In Old City: హైదరాబాద్ (Hyderabad) ఓల్డ్ సిటీలో ఆర్ఎస్ఐ మృతి కలకలం రేపింది. పాతబస్తీ కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తోన్న రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ బాలేశ్వర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Atchampeta) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ ఎస్ఐ. విధుల్లో భాగంగా అక్కడి నుంచి శనివారం పాతబస్తీకి వచ్చారు. తెల్లవారుజామున బాలేశ్వర్ విధులు నిర్వహిస్తోన్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. రెండుసార్లు తుపాకీ పేలడంతో అక్కడే ఉన్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆయన విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న డీసీపీ, ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా గన్ మిస్ ఫైర్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. బాలేశ్వర్ కు కుటుంబ కలహాలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు రౌండ్ల ఫైర్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.?

బాలేశ్వర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు కుటుంబ సభ్యులు అంటున్నారు. 'బాలేశ్వర్ కు కుటుంబ వివాదాలు ఏమీ లేవు. ఇది సూసైడ్ కాదని మేం నమ్ముతున్నాం. గన్ మిస్ ఫైర్ వల్ల జరిగింది అని అధికారులు మాతో చెప్పారు. మీడియా మాధ్యమాల్లో సూసైడ్ అని వస్తుంది. శనివారం రాత్రి కూడా బాలేశ్వర్ తో మాట్లాడాం. బాగానే మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరిగింది.' అని వారు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరు యువకుల సెల్ఫీ, ఇంతలో ఊహించని ప్రమాదం - ఒకరు దుర్మరణం

 

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Embed widget