Kothagudem: చనిపోయాడని సాయంత్రం అంత్యక్రియలు చేశారు.. రాత్రికి తిరిగి వచ్చాడు
చనిపోయిన యువకుడికి సాయంత్రం అంత్యక్రియలు చేశారు. అయితే యువకుడు సాయంత్రం తిరిగి వచ్చాడు. అది చూసి అంతా షాక్ అయ్యారు.
అయిదు రోజుల క్రితం... ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత శవమయై ఇంటికి వచ్చాడు. అయితే ఆ శవం గుర్తు పట్టకుండా అయిపోయింది. తమ కుమారుడు తమల్ని వదిలి పోయాడు అనుకుంటూ.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆ యువకుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తీసుకొచ్చి సాయంత్రం అంత్యక్రియలు చేశారు. ఇక్కడే ఓ ట్విస్టు ఆ యువకుడు సాయంత్రం తిరిగి వచ్చాడు. ఎలా సాధ్యమైంది? అసలు వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా ఊర్లోనే పని చేసేవాడు. కొన్ని రోజుల క్రితం.. ఏదో విషయంలో.. యజమానికి ప్రసాద్ కు గొడవ అయింది. ఈ క్రమంలో ప్రసాద్ ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించాడు. యువకుడి మనసుకు ఏం అనిపించిందో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై.. ప్రసాద్ తల్లి పోలీసులకు ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు మెుదలు పెట్టారు. ఆ మరుసటి రోజే.. తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్ లో గుర్తు తెలియని మృతదేహాం బయటపడింది.
మృతదేహం గుర్తు పట్టకుండా మారిపోయింది. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఒకరోజు ముందుగానే మిస్సింగ్ కేసు నమోదు చేయించిన ప్రసాద్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించి చూపించారు.. అయితే అప్పటికే కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండటంతో ప్రసాద్ గానే భావించారు. తమ గ్రామానికి కూడా మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. ఆ రాత్రికి ప్రాజెక్టు సమీపంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రసాద్ పారిపోవడానికి కారణమైన ట్రాక్టర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రసాద్ రాత్రిపూట చర్లలో ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి.. కుటుంబ సభ్యులు అవాక్కయ్యాడు. ఈ విషయం పోలీసులకు చెప్పారు. ట్రాక్టర్ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు ప్రసాద్ చెప్పాడు. రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు అనుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి