Private Travels Bus: ప్రయాణికుల లగేజీలతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ పరారీ... దిక్కు తోచని స్థితిలో వలస కూలీలు
గమ్యస్థానానికి తీసుకెళ్తామని నమ్మించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మార్గ మధ్యలో ప్రయాణికుల లగేజీలతో పరారయ్యారు. భోజన హోటల్ వద్ద దింపి టైర్ రిపేర్ చేయించుకోస్తామని చెప్పి ఉడాయించారు.
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసి పరారయ్యారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తామని నమ్మించి మార్గ మధ్యలో వదిలి లగేజీతో ఉడాయించారు. తెలంగాణ నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళ నుంచి అసోంకు 65 మంది వలస కూలీలు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద టిఫిన్ చేసేందుకు డ్రైవర్ బస్సు ఆపాడు. ప్రయాణికులు కిందకు దిగగానే డ్రైవర్, క్లీనర్ లగేజీలతో బస్సులో పరారయ్యారు. ప్రయాణికులు బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందిన వలస కూలీలుగా తెలుస్తోంది. తమ సామాన్లు, డబ్బు పోయిందని బాధితులు నార్కట్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేరళలో పనులు ముగించుకుని సొంత ఊర్లకు వెళ్లేందుకు ఓ ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరు రూ.3,500 చెల్లించినట్లు బాధితులు తెలిపారు. బస్సు డ్రైవర్, క్లీనర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. బాధితుల కోసం స్థానికంగా ఓ ఫంక్షన్‌హాల్‌లో పోలీసులు బస ఏర్పాటు చేశారు.
Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి
బాధితులకు నకిరేకిల్ ఎమ్మెల్యే పరామర్శ
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ వలస కూలీలు మోసం చేసి వారి సామాన్లతో పరారయ్యారు. నార్కట్‌పల్లి వద్ద అల్పాహారం కోసం బస్సును ఆపిన డ్రైవర్ ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో ఉడాయించారు. వీరు నార్కట్‌పల్లి ఫంక్షన్ హాల్‌లో రాత్రంతా పడిగాపులు కాశారు. సమాచారం తెలుసుకున్న నకిరేకిల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా తెలుసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు.
Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!
టైర్ రిపేర్ చేయించువస్తామని పరారీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసోం పరిసర రాష్ట్రాలకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో పనుల కోసం వలస వెళ్లారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి సొంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. వలస కూలీలను మార్గమధ్యలో నార్కెట్‌పల్లి భోజన హోటల్ వద్ద దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పి డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి కూలీలు పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Also Read: టపాసులు కొని సంతోషంగా ఇంటికి బయలుదేరగా.. మార్గం మధ్యలో పేలుడుతో ఆ కుటుంబంలో పెను విషాదం