Firecrackers Explode: టపాసులు కొని సంతోషంగా ఇంటికి బయలుదేరగా.. మార్గం మధ్యలో పేలుడుతో ఆ కుటుంబంలో పెను విషాదం
టపాసులు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలోనే పేలుడు సంభవించింది.
Firecrackers Explode: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా టపాసులు కాల్చుతుంటారు. కానీ అదే టపాసులు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పుదుచ్చేరిలోని అరియన్ కుప్పం ప్రాంతానికి చెందిన కలయని సన్ తన కుమారుడితో కలిసి తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు వెళ్లాడు. తన ఏడేళ్ల కుమారుడి కోసం మరక్కణంలో టపాసులు కొనుగోలు చేశాడు. రెండు బ్యాగుల నిండా టపాసులు కొని సంతోషంగా తన బైకుపై ఇంటికి బయలుదేరాడు మార్గం మధ్యలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో సంభవించిన ఈ పేలుడు ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతదేహాలు ముక్కలుముక్కలుగా కొన్ని మీటర్ల దూరం వరకు పడ్డాయి. వీరు ప్రయాణిస్తున్న బైక్ సైతం పూర్తిగా ధ్వంసమైంది.
Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తు నుంచి తొలగించడంపై సమీర్ వాంఖడే ఏమన్నారంటే..!
దీపావళి నింపిన విషాదం..
— ABP Desam (@abpdesam) November 6, 2021
టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది#Firecrackers #Diwali2021 #TamilNadu pic.twitter.com/pDjPKb9HWh
అదే దారిలో వెళ్తున్న మరికొందరు వాహనదారులకు కాలిన గాయాలయ్యాయి. ఒకట్రెండు వాహనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా రోడ్డుపై పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. టపాసులతో జాగ్రత్త అని నెటిజన్లు ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో ఆగని కాల్పుల మోత... మరో ముగ్గురు నక్సల్స్ మృతి
గాయపడిన వారిని దగ్గర్లోని న్యూ జిమ్మిర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పుదుచ్చేరి - తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో రెండు ప్రాంతాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు విల్లుపురం పోలీసులు టపాసులు ఎక్కడ కొన్నారని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.