News
News
X

Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం

Mulugu Accident : మలుగు జిల్లాలో కూలీలతో వెళ్తున్న ఓ ఆటో అతివేగంగా వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

FOLLOW US: 
Share:

 Mulugu Accident: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో ఆటో అతివేగంగా వచ్చి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో మహిళ స్పాట్లోనే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను పాసెంజర్ టీఎస్28టీ 2286 నంబర్ గల ఆటోలో తాడ్వాయి మండలం మేడారం సమీపంలో నాట్లు వేయడానికి ఓ డ్రైవర్ కూలీలను తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ ఆటోను అతి వేగంతో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్సీ వద్ద గల మూల మలుపులో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లెబోయిన సునీత(38) అక్కడికక్కడే చనిపోయింది. మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా జ్యోతి, బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం విధుల్లో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పది రోజుల క్రితం భద్రాద్రిలో ప్రమాదం - నలుగురి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో  కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ తో సహా ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతిచెందారని పోలీసులు తెలిపారు.  మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివ అని పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌ గా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అయితే వీళ్లంతా  ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రీ వెడ్డింగ్ షూట్ లోకేషన్ల కోసం వెళ్తూ 

 మహబూబాబాద్‌ వైపు నుంచి ఇల్లెందు వెళ్తోన్న టీఎస్‌03ఎఫ్‌ సీ 9075 గల కారును, ఇల్లెందు నుంచి మహబూబాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ16టీజీ 3859 నెంబర్ గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకుల్లో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు వరంగల్‌ జిల్లా కేంద్రం బట్టలబజారుకు చెందిన ఫొటోస్టూడియో యజమాని బైరి రాము, వరంగల్‌ నగరానికి చెందిన బాసబత్తిని అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు కూడా వరంగల్‌ జిల్లాకు చెందిన రిషీ, కళ్యాణ్‌గా తెలుస్తోంది.  వీళ్లంతా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఫొటో షూట్‌కు  లోకేషన్ల గుర్తించడానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.  

Published at : 04 Feb 2023 10:59 AM (IST) Tags: warangal crime news Mulugu accident Telangana News Woman Died in Accident Latest Accident

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

CI Dies Of Heart Attack: ఏపీలో మరో విషాదం - విధి నిర్వహణలో గుండెపోటుతో సీఐ మృతి

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !