News
News
X

Pseudo Naxal Arrest : ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు, ఇద్దరు సూడో నక్సల్ అరెస్ట్!

Pseudo Naxal Arrest : ఎయిర్ గన్స్ తో అమాయకులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు.

FOLLOW US: 
Share:

Pseudo Naxal Arrest : నక్సలైట్  పేరు చెప్పుకొని ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సూడో నక్సల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నించి రెండు ఎయిర్ గన్స్, ఒక  మోటర్ సైకిల్,  ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ సిబ్బందితో కలిసి తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో బైక్ పై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. 

అసలేం జరిగింది? 

నిందితులు  మేడి వెంకటేష్, ఆరేందుల.రాజేష్ చిన్నపటి నుంచి స్నేహితులు. కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరుతో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. రాజేష్ తను చెప్పినట్లు వింటే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని వెంకటేష్ ని ఒప్పించి,  కొంత కాలం నుంచి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా, కలిసినప్పుడే మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకోన్నారు. రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుంచి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరుతో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి ఫోన్, సిమ్ కొనుగోలు చేశారు. 

రూ.40 లక్షలు డిమాండ్ 

తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, ఫిబ్రవరి 21 రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, అతని కొడుకు నాగరాజులకి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సలైట్స్ మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే  మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితుల ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రాజేష్ మీద గతంలో మంచిర్యాల, హాజీపూర్  ఏరియాలలో పలు కేసులు నమోదు అయ్యాయి. నిందితుల నుంచి రెండు ఎయిర్ గన్స్,  పల్సర్ బైక్ , ఒక మొబైల్ స్వాధీనం చేసుకోన్నామని సీపీ తెలిపారు.  

Published at : 16 Mar 2023 05:08 PM (IST) Tags: Crime News money Mancherial News Pseudo naxals Air guns Extort

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం