News
News
X

Selfie Suicide : 'రాజు నేనేం పాపం చేశాను', ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి సెల్ఫీ సూసైడ్

Selfie Suicide : ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ చేసుకుంది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

FOLLOW US: 
 
Selfie Suicide : మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి పట్టణం షంషీర్ నగర్ కు చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నేల  మండలం పెద్ద లంబాడి తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్, ఈ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రాజకుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి రేపు మాపు అంటూ నెలలు గడుపుతున్నాడని సెల్ఫీ వీడియోలో యువతి ఆరోపించింది. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి అడగడంతో రాజ్ కుమార్ ముఖం చాటేయడంతో తాను మోసపోయానని యువతి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెల్లగక్కుతూ పురుగుల మందు తాగింది. నేన్నేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు యువతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు.  

చికిత్స పొందుతూ యువతి ఆత్మహత్య 

ఆరోగ్య కేంద్రం సిబ్బంది యువతికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు సమాధానం ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం యువతిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆరోగ్యం క్షీణించి యువతి మృతి చెందింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలు తన చావుకు కారణం తాను ప్రేమించిన ధరావత్ రాజ్ కుమార్ ఇంకా అతనీ కుటుంబ సభ్యులని సూసైడ్ నోట్లో పేర్కొంది. కూతురు చనిపోయిన విషయం తెలుసుకొని యువతి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కూతురు చావుకు కారణమైన రాజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి సోయం లక్ష్మీ డిమాండ్ చేశారు.  

నేనేం చేశాను పాపం

News Reels

"ఎందుకు రాజు నేనేం పాపం చేశాను. నువ్వే వచ్చి కలిశావు. నువ్వే పెళ్లి చేసుకుందాం అని చెప్పావు. నువ్వే చచ్చిపోతా అని చెప్పాను. టైం ఇవ్వు పెళ్లి చేసుకుందాం అని చెప్పావు. ఇంట్లో వాళ్లతో మాట్లాడతా అన్నావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనే సరికి మాట మారుస్తున్నాం. నా పరిస్థితి ఇది అని నేను ముందే చెప్పాను. ఆ పరిస్థితులతో నా సమస్య లేదు నువ్వే కావాలని అప్పుడు చెప్పావు. నవ్వు చెప్పిన పనులన్నింటిని చేశాను. మీ తమ్ముడంటాడు మా అన్నను చంపేస్తావా? అంటున్నాడు. నువ్వు మాట్లాడమంటనే నేను వాళ్లతో మాట్లాడాను. నీకు నాకు సెట్ కాదు రాజు అని నేను ముందే చెప్పాను. అప్పుడు ఏం కాదు కలిసుందాం అన్నావు. ఇప్పుడు నా తప్పులు ఎంచుతున్నావు. పెళ్లి అంటే ఎందుకు పారిపోతున్నావు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు. "- బాధిత యువతి సెల్ఫీ వీడియో 

Also Read : Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Also Read : నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

Published at : 07 Oct 2022 02:43 PM (IST) Tags: Woman suicide Selfie suicide TS News Mancherial News Selfie video Lover cheats

సంబంధిత కథనాలు

Konaseema News :  ఉసురు తీసిన ఉపాధి,  మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉసురు తీసిన ఉపాధి, మస్కట్ లో మహిళ ఆత్మహత్య!

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Dating App Cheating: డేటింగ్‌ యాప్స్‌లో కొత్త రకం మోసాలు, కిడ్నాప్‌ అవుతున్న యువకులు, ఉద్యోగులు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడి, భారీగా పోలీసుల మోహరింపు!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

Ludo Game Woman Bets Self : లూడో గేమ్ లో తనను తాను పందెంగా కాసిన మహిళ, ఓడిపోయి ఓనర్ కు వశమైంది!

టాప్ స్టోరీస్

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు