అన్వేషించండి

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపించాలని కోరారు. 

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐని ఆశ్రయించారు. త్వరగా విచారణ జరపాలంటూ ఈ ఉదయం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఓ కాంట్రాక్ట్‌ సంస్థతో కలిసి కాళేశ్వరంతో పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని వివరించారు. ఓ కంపెనీతో కలిసి లక్ష కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లారు. మొదటన తన వద్ద ఉన్న సాక్ష్యాలతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా సమావేశం అవుతారు. పాదయాత్రను మధ్యలో ఆపి మరి ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు.

ఇదే విషయమై మొన్నటికి మొన్న వైఎస్ షర్మిల.. గవర్నర్ తమిళిసైకి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తెలిపారు. అలాగే కాళేశ్వరం ముంపు, వర్షాల వల్ల కల్గిన నష్టం గురించి కూడా గవర్నర్ కు వివరించారు. తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే చర్చిస్తారా లేక ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడతారా అనే డిస్కషన్ జరుగుతోంది.  

ఇటీవలే తన తండ్రిని కుట్రచేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య ఢిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఢిల్లీలో సీబీఐతోపాటు బీజేపీ ఏ స్థాయి నేతలతో సమావేశం అవుతారన్నదానిపై స్పష్టత లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget