అన్వేషించండి

Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్

Maharashtra News : మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తన భార్యకు కనీసం చీర కూడా ఆరేయడం రాదని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ లో యువకుడు రాసిన కారణాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు.

Maharashtra News : చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు కొందరు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, నచ్చిన కూర వండలేదనో, నాన్న బైక్ కొనివ్వలేదనో ఇలా కారణాలు ఏమైనా సరే ఎంతో చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌కు చెందిన సమాధాన్ సాబ్లే(24) అనే యువకుడు తనకన్నా వయసులో ఆరేళ్ల పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత భార్య ప్రవర్తన సరిగా లేదని కారణం చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు యువకుడు రాసిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. తన భార్యకు కనీసం చీర కూడా ఆరేయడం కూడా రాదని, సరిగా నడవలేదని, మాట్లాడలేదని ఇలా రాసుకొచ్చాడు. తనతో జీవితాన్ని కొనసాగించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. 

అసలేం జరిగింది? 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల యువకుడు తన భార్యపై అసంతృప్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ముకుంద్‌నగర్‌లో నివాసం ఉంటున్న సమాధాన్ సాబ్లే సోమవారం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడని ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రహ్మ గిరి మాట్లాడుతూ "సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం. అందులో తన భార్య చీర సరిగ్గా కట్టుకోలేదని, నడవడం లేదా మాట్లాడటం రాదని అతను పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన కంటే ఆరేళ్లు పెద్దదైన మహిళతో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ జరుగుతోంది " అని అధికారి తెలిపారు.

పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య 

తన చావుకు తానే కారణమని రాసి ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీకి చెందిన శివకృష్ణ (27) నారాయణఖేడ్‌లో మిషన్ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నారు. అతనికి ఇటీవలే వివాహం కుదిరింది.  ఈ నెల 13న నారాయణఖేడ్ నుంచి ఇంటికి వచ్చిన శివకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత శివకృష్ణకు తండ్రి ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో పెద్ద కుమారుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. గుర్రంగూడలోని తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసిన పెద్ద కుమారుడు ఇంటికెళ్లి చూడమని చెప్పాడు. సోమవారం రాత్రి అతడు ఇంటికి వెళ్లగా, తలుపు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో శివకృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి దుస్తుల్లో ఉన్న సూసైడ్‌ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడు. తనకు తానే కారణమని పేర్కొన్నాడు. పెళ్లి ఇష్టం లేక అతడు ఈ పనికి పాల్పడినట్టు శివకృష్ణ తండ్రి పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget