అన్వేషించండి

Minor girl murder case: డబ్బుల కోసం కాదు బ్యాట్ కోసం హత్య - కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల ప్రకటన

Sahasra Case: బ్యాట్ కోసమే బాలికను హత్య చేశాడని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.ఈ హత్య కేసును చేధించిన వైనంపై పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Sahasra Murder For Bat:  హైదరాబాద్ కూకట్ పల్లిలో బాలికను హత్య చేసిన బాలుడి ఘటనలో పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగా డబ్బుల దొంగతనం కోసం ఈ హత్య జరగలేదని.. క్రికెట్ బ్యాట్ కోసమే  హత్య జరిగిదని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.  బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని.. బ్యాట్ దొంగతనం కోసం నెల రోజుల ముందే బాలుడు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలిపారు.  బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

బాధిత కుటుంబానికి,  హంతకుడి కుటుంబానికి పరిచయాలు ఉన్నాయి.  ఇరువురి ఇళ్లల్లో ఏవైనా వేడుకలు జరిగితే వచ్చిపోతూంటారు. గత ఏడాది సహస్ర బర్త్ డే వేడుకలకూ ఆ బాలుడు వెళ్లాడు.  సహస్ర తమ్ముడితోనూ నిందితుడు స్నేహంగా  ఉంటూ ఇద్దరూ  క్రికెట్  ఆడేవారు. సహస్ర తమ్ముడి వద్ద క్రికెట్  బ్యాట్ ఉంది. అది ఇవ్వాలని అడిగినా ఎప్పుడూ ఇవ్వకపోవడంతో దాన్ని  దొంగతనం చేయాలని అనుకున్నాడు.  ఓటీటీలు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న బాలుడు... దొంగతనం  చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. నెల రోజుల పాటు ఇందు కోసం పరిస్థితులు గమనిస్తూ వస్తున్నాడు. దొంగతనం ఎలా చేయాలో బాలుడు ముందుగానే స్లిప్‌లో రాసుకున్నాడు. చివరిలో మిషన్ డన్ అని కూడా స్లిప్‌లో రాసుకున్నాడు.

బ్యాట్ దొంగతనం చేయాలనుకున్న  రోజున  అందరూ పనులకు వెళ్లారని నిర్దారించుకున్న  తర్వాత  బ్యాట్ దొంగతనం కోసం సహస్ర ఇంటికి వెళ్లాడు.  కిచెన్ లో ఉన్న బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర గుర్తించి చొక్కా పట్టుకుంది. ఆపై బాలికను తోసేసి కళ్లు మూసి విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.  

సహస్ర హత్య తరువాత బాలుడు తల్లికి కూడా అనుమానం  వచ్చింది. ఆ విషయాన్ని బాలుడ్ని కూడా అడిగింది. అయితే తాను చంపలేదని.. కానీ  నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావని  తల్లిపై తిరగబడినట్లుగా పోలీసులు చెప్పారు.  పోలీసులకు బాలుడుపై ముందే అనుమానం వచ్చిందని..   ప్రాసెస్ ప్రకారం విచారిస్తూ వచ్చే సరికి ఆలస్యం అయింది. వేరే వారు కూడా గోడ వద్ద బాలుడు తచ్చాడుతూ ఉన్న విషయాన్ని చూసి మాకు చెప్పారని పోలీసులు  ప్రకటించారు.  మర్డర్ తరువాత బాలుడు షర్ట్ కు రక్తం మరకలు అంటుకున్నాయని..  దండెం మీద ఆరేసిన  షర్టును అడ్డుపెట్టుకొని ఇంట్లోకి వెళ్లి స్నానం చేశాడన్నారు. 

బాలుడు రెండు నెలల కిందట ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని.. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నామన్నారు. బాలుడి ఇంట్లో కూడా ఫోన్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని..  దాన్ని బట్టి ఇతర  నేరాలు ఇంకేమైనా చేశాడా అనే విషయంపై విచారణ చేస్తున్నామని  సీపీ మహంతి తెలిపారు. ఓ చిన్న బ్యాట్ కోసం ఏ మాత్రం సంకోచించకుండా బాలిక ప్రాణాలు తీసిన బాలుడి ఉదంతం  అందర్నీ షాక్‌కు గురి చేసింది.  

అయితే ఈ హత్య కేసులో  ఆ బాలుడే కాదు.. అతని తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని..వారిపై కూడా కేసులు నమోదు చేయాలని సహస్ర తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget