అన్వేషించండి
Marreddy Srinivasa Reddy: తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తులతో దాడి, పరిస్థితి విషమం
Knife attack on Marreddy Srinivasa Reddy: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కొందరు కత్తులతో దాడి చేశారు.

తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం
Telugu Raithu President Marreddy Srinivasa Reddy: ఒంగోలు: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. దుండగుల కత్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ఆయనను చికిత్స నిమిత్తం ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వినిపిస్తోంది.
ఇంకా చదవండి





















