News
News
X

Karimnagar Crime : ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Karimnagar Crime : కరీంనగర్ జిల్లాతో సంబంధం ఉన్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.

FOLLOW US: 
Share:

Karimnagar Crime : కొంతకాలంగా వరుస కేసుల్లో పేరు నానుతున్న కరీంనగర్ కి సంబంధించిన మరో కేసు సంచలనంగా మారింది. భారీ ఎత్తున నెట్వర్క్ మైంటైన్ చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దానికి సంబంధించిన పలువురు నిందితుల అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో అనంతపురం జిల్లా.. తెలంగాణలో కరీంనగర్ జిల్లాకి  ఈ సెక్స్ రాకెట్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇదే విషయంపై యాదాద్రి భువనగిరి జిల్లాలో నిఘా వేసిన పోలీసులకు ఓ ముఠా చిక్కింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ అనే మహిళ ఇద్దరు ఆడపిల్లలను కొనుగోలు చేసి వారి ఆలనా పాలనా చూసింది. అయితే ఇదంతా ఏదో వారి జీవితం నిలబెట్టడానికి కాదు. యుక్త వయసు రాగానే వారితో వ్యభిచారం చేయించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేసింది. దీనికి తగ్గట్టుగానే తమ దగ్గర బంధువైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాసి కంసాని శ్రీనివాస్ ని సంప్రదించింది. తంగళ్ళపల్లిలో ఉండే శ్రీనివాస్ ఈ ప్రపోజల్ కి అంగీకరించి ఆ బాలికలను తీసుకొని వచ్చి దందా షురూ చేశాడు. మరోవైపు కోరినప్పుడల్లా అనసూయ వద్దకు ఆ అమ్మాయిలను పంపిస్తూ ఉండేవాడు. అయితే ఈ వ్యవహారం నచ్చని ఆ అమ్మాయిలు తిరగబడినప్పుడల్లా వారిని అనసూయ తన సహచరుల సాయంతో తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసేది. దీంతో ఆ అమ్మాయిలు ఎలాగైనా అక్కడి నుండి పారిపోవాలని నిర్ణయించుకొని ఒకరోజు సమయం చూసి ప్లాన్ చేసిన కేవలం ఒక అమ్మాయి మాత్రమే అనసూయ బారి నుంచి తప్పించుకోగలిగింది.

పోలీసుల సాయంతో గుట్టు రట్టు 

అయితే అలా తప్పించుకున్న బాలిక జనగామ జిల్లాలోని బస్టాండ్ లో పోలీసుల కంటపడగా ఆమెను విచారించారు. దీంతో తనతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారంటూ ఆ బాలిక యాదగిరి పల్లికి చెందిన అనసూయ కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి కి చెందిన శ్రీనివాస్ పై కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సైదులుకి సమాచారం అందించారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇక ఈ నెల మూడో తేదీన ఆఫీసర్ ఫిర్యాదుతో యాదగిరిగుట్ట పోలీసులు షీ టీమ్స్ చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు యాదగిరి పల్లిలోని అనసూయ ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో సిరిసిల్ల తంగళ్ళపల్లి కి చెందిన కంసాని శ్రీనివాస్ తో పాటు కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా భాస్కర్, చందా కార్తీక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ కు చెందిన కంసాని లక్ష్మీలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక యాదగిరి పల్లికి చెందిన కంసాని ప్రవీణ్, హుస్నాబాద్ కి చెందిన కంసాని స్వప్న, అశోక్ కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Published at : 08 Dec 2022 08:17 PM (IST) Tags: Crime News TS News Karimnagar News Human trading

సంబంధిత కథనాలు

Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!

Eluru: తల్లీకూతుర్లను ఇంటికి తెచ్చుకున్న ప్రియుడు, ఆమెతో సహజీవనం! విషాదం మిగిల్చిన కరెంటు బిల్లు!

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!

Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!

టాప్ స్టోరీస్

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...