అన్వేషించండి

Kadapa Inter Student: 'పెళ్లి చేసుకోమని అడిగినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడు' - ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు

Crime News: కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసుకోమని అడిగినందుకే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు.

Kadapa SP Press Meet On Badwel Student Murder Case: కడప జిల్లా (Kadapa District) బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పథకం ప్రకారమే నిందితుడు విఘ్నేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్థన్ కేసు వివరాలు వెల్లడించారు. 'నిందితుడు విఘ్నేశ్‌కు బాధిత బాలిక (16)కు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. విఘ్నేశ్ కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 6 నెలల క్రితం వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతను విద్యార్థిని ఫోన్ చేసి తనను కలవాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేశ్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ వద్ద ఆటో దిగారు. సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి సరదాగా కాసేపు గడిపారు. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విఘ్నేశ్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.' అని ఎస్పీ తెలిపారు.

పక్కా ప్లాన్‌తోనే..

బాలికకు నిప్పంటించిన నిందితుడు విఘ్నేశ్ ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ హర్షవర్థన్ తెలిపారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2:30 గంటలకు బాలిక మృతి చెందిందని చెప్పారు. 'బాలికను ఏదో ఒకటి చేయాలనే పథకంతోనే విఘ్నేశ్ ఆమెకు ఫోన్ చేశాడు. కడప నుంచి వచ్చేటప్పుడు ముందుగానే పెట్రోల్ బాటిల్ బ్యాగులో పెట్టుకుని బయలుదేరాడు. పథకం ప్రకారమే ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. గతంలోనూ ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో విఘ్నేశ్ కొంతకాలం ఆమెను దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ దగ్గరయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని శనివారం కూడా బాలిక ఒత్తిడి చేయడంతోనే విఘ్నేశ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటనా స్థలంలో అన్నీ ఆధారాలు సేకరించాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి త్వరగా శిక్ష పడేలా చూస్తాం.' అని ఎస్పీ తెలిపారు.

సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుడికి మరణశిక్ష స్థాయిలో కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'బద్వేల్‌లో యువకుడి పెట్రోల్ దాడిలో గాయపడ్డ ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఓ దుర్మార్గుడి దుశ్చర్యకు ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని బలి కావడం విచారకరం. బాధిత కుటుంబానికి న్యాయం చేయడమంటే.. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఓ హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, మరోచోట రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు దుర్మరణం

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Embed widget