అన్వేషించండి

Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

Kakinada News: కరెంట్ షాక్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. అటు, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Mother And Son Died Due To Current Shock In Kakinada: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెందగా.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా (Kakinada District) సామర్లకోటలోని 20వ వార్డులో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక వీర రాఘవపురం సత్తమ్మతల్లి ఆలయం సమీపంలో నివసిస్తోన్న చిట్టిమని పద్మ (40) శనివారం ఇంటి పక్కన ఉన్న కాల్వలోకి తుళ్లిపడి మృతి చెందారు. ఆదివారం ఆమె కుమారుడు విశ్వేస్ (23) కూడా అక్కడే దుస్తులు ఆరేసే తీగను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అయితే, పద్మ కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రోడ్డు ప్రమాదంలో..

అటు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ - హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇటీవల వచ్చిన వరదలకు గరికపాడు వంతెన దెబ్బతింది. ఈ క్రమంలో పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో ఎదురెదురుగా వస్తోన్న రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మొండికట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టగా.. అది ఎదురుగా వస్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వినుకొండ, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈతకు వెళ్లి విద్యార్థులు

అటు, కృష్ణా జిల్లాలో క్వారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లారు. గుంతలు లోతుగా ఉండడాన్ని గమనించిన విద్యార్థులు నీటిలో దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీటిలో పడి తిరువూరుకు చెందిన దుర్గాప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్ రాజు అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Naga Vamsi: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
Google Pixel 8: ఈ గూగుల్ ఫోన్‌పై భారీ ఆఫర్ - సగం కంటే తక్కువ ధరకే!
ఈ గూగుల్ ఫోన్‌పై భారీ ఆఫర్ - సగం కంటే తక్కువ ధరకే!
Kadapa Inter Student: 'పెళ్లి చేసుకోమని అడిగినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడు' - ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
'పెళ్లి చేసుకోమని అడిగినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడు' - ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మరో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనా, ఈసారి పసికూనపై ప్రతాపంమసీదుకు హిందూ సంఘాలు, ముత్యాలమ్మ గుడిపై డీసీపీ సంచలన నిజాలుKTR Comments: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు - కేటీఆర్సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Naga Vamsi: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ
Google Pixel 8: ఈ గూగుల్ ఫోన్‌పై భారీ ఆఫర్ - సగం కంటే తక్కువ ధరకే!
ఈ గూగుల్ ఫోన్‌పై భారీ ఆఫర్ - సగం కంటే తక్కువ ధరకే!
Kadapa Inter Student: 'పెళ్లి చేసుకోమని అడిగినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడు' - ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
'పెళ్లి చేసుకోమని అడిగినందుకే పెట్రోల్ పోసి తగలబెట్టాడు' - ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Telangana News: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
Top Bikes Under Rs 1 lakh: రూ.లక్షలో మంచి బైక్స్ చూస్తున్నారా? - ఈ నాలుగు బైక్స్ మీకోసమే!
రూ.లక్షలో మంచి బైక్స్ చూస్తున్నారా? - ఈ నాలుగు బైక్స్ మీకోసమే!
Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
Embed widget