Software Employee Suicide : ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన లవర్, సూసైడ్ చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి
Software Employee Suicide : లవ్ చేసిన యువతి మాట్లాడడం మానేసిందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
![Software Employee Suicide : ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన లవర్, సూసైడ్ చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి Hyderabad software employee committed suicide lover blocked phone number Software Employee Suicide : ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన లవర్, సూసైడ్ చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/18/1cdf73c5a04825e87b724fa73ca357f31679150863944235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Software Employee Suicide : హైదరాబాద్ చందానగర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేరిలింగంపల్లి చందానగర్ లోని ఓ లాడ్జ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అఖిల్(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివపేట ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్.. గచ్చిబౌలి లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం చందానగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని, తన ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టిందని సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సూసైడ్ నోటు లభ్యం
ప్రేమించిన యువతి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందని సాఫ్ట్ వేర్ ఉద్యోగి అఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్ లో అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో గత కొంతకాలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు. రోజు ఇద్దరూ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఈ లవ్ స్టోరీ సడన్ గా బ్రేకప్ అయింది. ఒక్కసారిగా ప్రేమించిన యువతి అఖిల్ తో మాట్లాడడం మానేసింది. దీంతో అఖిల్ తీవ్ర మనస్తాపం చెందాడు. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి 17న చందానగర్ లోని ఓ లాడ్జ్ లో అఖిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇంత చిన్న దానికే ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అఖిల్ బంధువు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని సూసైడ్ నోటు రాసి అఖిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అనుకున్న ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుడి మరణం కంటతడి పెట్టిస్తోంది. బతుకు బాగుంటుందని చాలా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. జాబ్ రాలేదు. వ్యూహాన్ని మార్చుకొని సాఫ్ట్‌వేర్ వేపు చూశాడు. అక్కడ కూడా లే ఆఫ్‌లు టెన్షన్ పెట్టాయి. ఇంతలో ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు వేసింది. వాటికైనా ప్రిపేర్ అయితే లైఫ్‌లో సెటిల్ అవుతాని అనుకున్నాడు. కానీ విజయాన్ని అందుకోక ముందే తనువు చాలించాడు. ప్రయాణాన్ని ముగించేశాడు.
సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన నవీన్ కుమార్‌కు 30 ఏళ్లు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. అనుకున్న ఉద్యోగం రాలేదు. ఒత్తిడి పెరిగింది. తెలిసిన వాళ్ల సలహా మేరకు సాఫ్ట్‌వేర్ వైపు చూశాడు. అక్కడ కూడా ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇంతలో సాఫ్‌వేర్ ఇండస్ట్రీలో ప్రంకపనలు మొదలయ్యాయి. ఒత్తిడిలో ఉన్న నవీన్‌కు ఊరిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్సు పడ్డాయి. అంతే మైండ్ సెట్ మారిపోయింది. ప్రైవేటు ఉద్యోగాల వేట వదిలేసి ప్రభుత్వ కొలువు కోసం కొట్లాడ మొదలెట్టాడు. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రిపీర్ అవుతున్నాడన్న విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లు బంధువులు చాలా సంతోషించారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ... శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కొలువు కోసం చేస్తున్న పోరాటాన్ని మధ్యలోనే వదిలేసి ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడు. నవీన్ ఆత్మహత్య సంగతి తెలుసుకున్న ఫ్యామిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు నాగభూషణం, సుశీల, ఇద్దరు సోదరులు బోరున విలపిస్తున్నారు. నవీన్ ఆత్మహత్య చేసుకోకు ముందు ఓలెటర్ రాసి పెట్టాడు. తనకు జాబ్ లేదని... తాను పనికిరానివాడనని బాధ పడుతూ లెటర్ రాశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని... ఉద్యోగం లేకపోవడమే ఇబ్బంది అని అందులో చెప్పాడు. లెటర్‌లో ఏముంది అంటే... అన్‌సైటిస్ఫైడ్ లైఫ్..నో వన్ రీజన్ ఫర్ దిస్. ఐయామ్ యూజ్ లెస్ ఆల్ జాబ్ లెస్. థాంక్యూ మై ఫ్యామిలీ. ఐ క్విట్ అని రాసి బాధపడుతున్నట్టు ఎమోజీ పెట్టి సంతకం పెట్టి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)