Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు
మధుసూదన్ రెడ్డి హత్య కేసులో అసలు విషయం వెలుగు చూసింది. గంజాయి వ్యాపారంలో వచ్చిన వివాదాల వల్ల ఆయన హత్యకు గురయినట్లుగా పోలీసులు తేల్చారు.
హైదరాబాద్‌కు చెందిన మధుసూధన్ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. గంజాయి వ్యాపారం కారణంగానే మధుసూధన్ రెడ్డిని హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ అనే వ్యక్తితో మధుసూధన్ రెడ్డికి గతంలోనే పరిచయం ఏర్పడగా.. అతనే మధుసూధన్ రెడ్డిని ఈ వ్యాపారంలోకి దింపాడు. ఈ క్రమంలో మధుసూధన్‌తో సంజయ్ రూ.40 లక్షలకు గంజాయి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంజయ్ గంజాయి ఇవ్వకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆ విషయంలో వివాదం చెలరేగింది. బీదర్‌లో డబ్బులు ఇస్తానని నమ్మించి మధుసూధన్ రెడ్డి తీసుకెళ్లిన సంజయ్.. పాతబస్తీ పరిసరాల్లో హత్య చేసినట్లు గుర్తించారు.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 19న చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. అతణ్ని మధుసూదన్ రెడ్డి అని గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఈయన్ను ఆగస్టు 19న కిడ్నాప్ చేసి సంగారెడ్డి జిల్లాలో చంపినట్లుగా భావించారు. మధుసూధన్ రెడ్డి స్నేహితులే కిడ్నాప్ చేసి, హతమార్చినట్లుగా అంచనాకు వచ్చారు. చంపిన మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టినట్లుగా పోలీసులు తెలిపారు.
Also Read: Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు
మృతదేహం వెలికితీత
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం, దిగ్వాల్ శివారులో పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం, రామంచ గ్రామానికి చెందిన ఎడ్ల మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డిని స్నేహితులే అని రెండ్రోజుల క్రితం పోలీసులు గుర్తించారు. మధుసూదన్ రెడ్డిపై పలు కేసులు కూడా ఉన్నాయని, వాటిలో నిందితుడిగా కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. తాజాగా ఆయన గంజాయి వ్యాపారం చేస్తారని, అందులో గొడవ వల్లే వివాదానికి దారి తీసి కిడ్నాప్ చేసి చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
Also Read: Dalitha Bandhu News: దళిత బంధుపై వేగం పెంచిన సర్కార్.. మరో రూ.500 కోట్లు విడుదల