అన్వేషించండి

Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!

హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ ఏకంగా రూ.లక్షకు పైగా సొమ్మును పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బాధితుడు తన తప్పును తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

బ్యాంకు ఏటీఎం కార్డులకు, యూపీఐ యాప్‌లకు పిన్ నెంబరు సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త! మనకు గుర్తు ఉండేందుకు సులువుగా ఉంటుందని నాలుగు అంకెల పిన్ నెంబరును కూడా ఫ్యాన్సీ నెంబర్లుగా పెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన పిన్ నెంబరు సెట్ చేసుకొనే విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తోంది. హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ ఏకంగా రూ.లక్షకు పైగా సొమ్మును పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదంతా తాను ఏడాదిగా చిట్టీ కట్టుకున్న సొమ్ము కావడం గమనించదగ్గ విషయం. దీంతో బాధితుడు తన తప్పును తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాలివీ..

కూకట్‌పల్లి ఏవీబీ పురంలో రాము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ట్రాలీ నడుపుతూ దానిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న సరకును మార్కెట్‌కు తీసుకువెళ్లినప్పుడు అతని ఫోన్ చోరీకి గురైంది. దీంతో వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకసారి అనుమానం వచ్చి తన ఖాతాను చెక్ చేసుకోగా కంగుతిన్నాడు. ఆయన ఖాతాలో రూ.1.33 లక్షలు మాయం కావడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. తాను ఆ డబ్బును ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు నెల నెలా చిట్టీలు కట్టుకుంటూ వచ్చానని వివరించాడు. అలా చిట్టీ పాడగా వచ్చిన డబ్బును తన స్టేట్ బ్యాంకు ఖాతాలో వేయగా ఆ సొమ్మంతా ఖాళీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్నానని.. వాటిని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేశానని పోలీసులకు వివరించాడు. అన్ని యూపీఐ యాప్‌లకి ఒకే పిన్ ఉంటుంది కాబట్టి.. సులభంగా గుర్తుండేలా పిన్‌ నెంబరును 1234 అని పెట్టుకున్నానని చెప్పాడు. అయితే, ఫోన్ పోయిన వెంటనే అది దొరికిన నిందితుడు యూపీఐ యాప్‌లో 1234 పిన్ నొక్కి ఉంటాడని, దీంతో డబ్బులన్నీ అతని ఖాతాలోకి వెళ్లిపోయినట్లుగా బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే, బ్యాంకు స్టేట్ మెంట్ వివరాలు చూడగా.. జ్యుయలరీ షాపులో బంగారం, డీ మార్ట్‌లో షాపింగ్‌ కూడా చేశాడని వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డీ మార్ట్‌, జ్యుయలరీ షాపుల్లో సీసీటీవీ వీడియో ఫుటేజీ కోసం పరిశీలించారు. వాటిని పరిశీలించి నిందితుడి కోసం వెతుకుతున్నారు. యూపీఐ పిన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కఠినమైన పిన్ నెంబర్లను, ఫోన్లకు పాస్ వర్డ్‌లను వాడాలని పోలీసులు సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget