Jubilee Hills: భార్య వేలు కట్ చేసి పారిపోయిన భర్త.. వెతుకుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం తేవాలని తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

FOLLOW US: 

అదనపు కట్నం కోసం అతివలపై వేధింపులు ఆగడం లేదు. డబ్బుల కోసం గృహ హింసకు పాల్పడే వారి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే, పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ, ప్రేమ పెళ్లి చేసుకున్న వీరి విషయంలో కూడా అదనపు కట్నం కోసం వేధించాడు. చివరికి కోపం పట్టలేకపోయిన అతను తన భార్య వేలు కట్ చేసి మరీ పరారయ్యాడు.

Also Read: తెలుగు అకాడమీ ఉద్యోగులు - బ్యాంక్ స్టాఫ్ కలిసి చేసిన దోపిడి ! ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం తేవాలని తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముంబయిలో నివసించే హసి అనే 22 ఏళ్ల యువతి, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్‌ ఫేస్‌ బుక్‌లో పరిచయం అయింది. రవి నాయక్‌ కొద్ది రోజుల క్రితమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి వెంకటగిరి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు.

నగరంలోనే హసి బ్యుటీషియన్‌గా పని చేస్తుండగా.. రవి నాయక్‌ ఖాళీగా ఉండేవాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ.50 వేలు కావాలంటూ రవి నాయక్‌ భార్యను అడిగాడు. ఆమె తన వద్ద లేవని తేగేసి చెప్పేయడంతో తీవ్రంగా కొట్టి.. కత్తితో భార్య ఓ వేలిని కట్‌ చేసి పోయాడు. మరోసటి రోజు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె భర్త రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు.

Also Read: Khammam: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..

సినీ కార్మికుడి ఆత్మహత్య
మరోవైపు, బంజారాహిల్స్‌లో సినీ కార్మికుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన తారకేశ్వరరావు అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ఆయన డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుండడంతో రోజూ ఇంట్లో గొడవ జరిగేది. ఈనెల 10న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో గదిలోకి వెళ్లిన తారకేశ్వరరావు తలుపు వేసుకొని లుంగీతో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్... ప్రభుత్వానికి నివేదిక అందించిన త్రిసభ్య కమిటీ... యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి ఆరు రోజుల కస్టడీ

Also Read:  తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Hyderabad News Jubilee Hills Dowry Harrassment Additional Dowry Harrassment Domestic Violence

సంబంధిత కథనాలు

Hyderabad Crime: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం

Hyderabad Crime: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం

Khammam: రూ.100 కోసం వ్యక్తి హత్య.. కత్తితో ఛాతిలో పొడిచి దారుణం

Khammam: రూ.100 కోసం వ్యక్తి హత్య.. కత్తితో ఛాతిలో పొడిచి దారుణం

Hyderabad: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్

Hyderabad: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్

Hyderabad Crime: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!

Hyderabad Crime: రాజేంద్రనగర్ లో దారుణం... ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిక అత్యాచారం...!

Anantapur News: ఈ తాత టార్గెట్ యువతులే... రిటైర్డ్ అయ్యే వయసులో పాడు పనులు...

Anantapur News: ఈ తాత టార్గెట్ యువతులే... రిటైర్డ్ అయ్యే వయసులో పాడు పనులు...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

RC17: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

T20 World Cup Streaming: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Turmeric Water: రోజూ పసుపు కలిపిన వేడి నీళ్లు, పసుపు పాలు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!

Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!