News
News
వీడియోలు ఆటలు
X

Gachibowli Accident : ఎగిరి పుట్ పాత్ పైన పడిన కారు, గచ్చిబౌలిలో రోడ్ టెర్రర్ - ముగ్గురు మృతి

Gachibowli Accident : హైదరాబాద్ గచ్చిబౌలిలో కారు రోడ్ టెర్రర్ సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు మధ్యలో మొక్కలు నీరు పోస్తున్న మహిళ ఢీకొట్టింది. కారు ఎగిరి పుట్ పాత్ పై పడింది.

FOLLOW US: 
Share:

 Gachibowli Accident : నిన్న జూబ్లీహిల్స్ ప్రమాదం మరువక ముందే హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో కారు(Car Accident) బీభత్సం సృష్టించింది. హోలీ(Holi) పండుగ రోజు విషాధాన్ని మిగిల్చాయి. మద్యం మత్తులో కారు నడిపి ఓ మహిళతో, వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కారు ఎగిరి పుట్ పాత్(Footpath) పైన పడిందంటే ఎంత వేగంతో వచ్చిందో ఊహించవచ్చు. కారు టైర్లు కూడా ఊడిపోయి వాహనం తుక్కు తుక్కు అయ్యింది. 

మద్యం మత్తులో కారు నడిపి

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో బీభత్సం సృష్టించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. గచ్చిబౌలి(Gachibowli) ఎల్లా హోటల్ సమీపంలోని రహదారి మధ్యలో ఉన్న చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ (38) అనే మహిళలను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్వరమ్మ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొన్న తర్వాత కారు బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు రోహిత్, గాయత్రి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స కోసం ఏఐజీ(AIG Hospital) ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. 

Also Read : Attack on Excise SI: ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై  దాడి

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం  

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు, బైక్‌ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తోన్న ఓ కారు ఎటునాగారం నుంచి హనుమకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీ కొన్నారు. అదే సమయంలో పక్కన వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టాయి. ఈ క్రమంలో కార్ల వెనుక వస్తున్న మరో కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారు కూడా గాయపడ్డారు. 

Also Read : Jubileehills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ ఎమ్మెల్యే కజిన్, అతడి కుమారుడు అరెస్టు

Published at : 18 Mar 2022 09:15 PM (IST) Tags: Hyderabad TS News car accident Gachibowli

సంబంధిత కథనాలు

Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!

Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!

US Teen Murders: తల్లిదండ్రుల్ని, తమ్ముళ్లను కాల్చి చంపిన 18 ఏళ్ల కుర్రాడు - రక్తంతో తడిసిపోయిన ఇల్లు

US Teen Murders: తల్లిదండ్రుల్ని, తమ్ముళ్లను కాల్చి చంపిన 18 ఏళ్ల కుర్రాడు - రక్తంతో తడిసిపోయిన ఇల్లు

Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్‌ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్

Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్‌ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్

Dimple Hayathi: డింపుల్ హయతి ఇంట్లోకి చొరబడ్డ యువతీ, యువకుడు - ఎలా సాధ్యమైందంటే

Dimple Hayathi: డింపుల్ హయతి ఇంట్లోకి చొరబడ్డ యువతీ, యువకుడు - ఎలా సాధ్యమైందంటే

వృద్ధుడిపై 40 మొసళ్లు దాడి, గుర్తు పట్టలేనంతగా ముక్కలు ముక్కలైన శరీరం

వృద్ధుడిపై 40 మొసళ్లు దాడి, గుర్తు పట్టలేనంతగా ముక్కలు ముక్కలైన శరీరం

టాప్ స్టోరీస్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ

Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ