Hyderabad News : హైదరాబాద్ లో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad News : హైదరాబాద్ లో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ సంచలనం అయింది. విద్యార్థిని మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆచూకీ కనుగొన్నారు.
Hyderabad News : హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. కాలేజికి వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సఖిరెడ్డి వర్షిణి అనే విద్యార్థిని మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. గురువారం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగి రాలేదు. వర్షిణిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్షణి సమీప బంధువు మోహన్ రెడ్డి గురువారం ఆమెను సీఎంఆర్ టెక్నికల్ కళాశాల వద్ద దిగబెట్టారు. పరీక్షల కోసం ఆమె కళాశాలకు వెళ్లింది. ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లోనే మరిచిపోయానని చెప్పి క్యాంపస్ నుంచి తిరిగి బయటికి వచ్చిన వర్షిణి ఆ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ప్రైవేటు కళాశాల విద్యార్థిని వర్షిణి మిస్సింగ్ ను పోలీసులు ఛేదించారు. ముంబయిలో విద్యార్థి ఆచూకీని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడం కలకలంరేపింది. మిడ్ ఎగ్జామ్ కోసం కాలేజీకి వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాలేదు. కాలేజీలో విచారిస్తే ఐడీ కార్డు, మొబైల్ ఇంట్లో మరిచిపోయానని చెప్పి క్యాంపస్ నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది.
ముంబయిలో ఆచూకీ
విద్యార్థిని మిస్సింగ్ పై తల్లిదండ్రులు ఫిర్యాదుచేయడంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని కోసం గాలింపు చేపట్టారు. కాలేజీ వెళ్లిన తర్వాత ఆమె బయటకు వచ్చే సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ముంబయిలో ఓపెన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఉన్న టవర్ లోకేషన్ ఆధారంగా ముంబయి స్థానిక పోలీసులు, రైల్వే పోలీసుల సాయంతో వర్షిణి ఆచూకీ గుర్తించారు. ప్రస్తుతం విద్యార్థిని రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముంబయి వెళ్లిన మేడ్చల్ పోలీసులు విద్యార్థినిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. చదువు విషయంలో డిప్రెషన్ వల్ల ఇంట్లో నుంచి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : CI Nageswararao Case : అజ్ఞాతంలో సీఐ నాగేశ్వరరావు, రేపటిలోగా అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్
Also Read : Hyderabad Crime : లక్షల విలువైన బైక్ రూ.30 వేలకే, ఖరీదైన బైకులే ఈ ముఠా టార్గెట్!