Drug racket at Mahindra University: మహింద్రా యూనివర్శిటీలో డ్రగ్స్ ముఠాల హల్‌చల్ - ప్రత్యేక ఆపరేషన్‌తో గుట్టురట్టు చేసిన ఈగల్
Hyderabad: హైదరాబాద్‌లో ఈగల్ టీం మరో డ్రగ్ రాకెట్‌ను పట్టుకుంది. మహింద్రా యూనివర్శిటీలో విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లుగా గుర్తించారు.

EAGLE Telangana Busts a Drug Racket in Mahindra University: హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్ రాకెట్ ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం అంతర్‌రాష్ట్ర డ్రగ్ రాకెట్‌ను అరెస్టు చేసింది. ఆగస్టు 25, 2025న జీడిమెట్లలోని శివాలయం కాలనీలో జరిపిన దాడిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్, డ్రగ్ ప్యాకింగ్ మెటీరియల్, డిజిటల్ తూనిక యంత్రం, బహుళ స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది విద్యార్థులపై విచారణ జరుగుతోంది.
మల్నాడు రెస్టారెంట్ లింకులతోనే ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో శ్రీ మారుతి కొరియర్స్ ద్వారా డ్రగ్ పార్సెళ్లు బుక్ అయినట్లు తేలింది. దిల్లీలోని నైజీరియన్ వ్యక్తి నుంచి వచ్చిన రెండు పార్సెళ్లను మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థి దినేష్ స్వీకరించాడు. మరో విద్యార్థి భాస్కర్ నైజీరియన్ "నిక్"కు రూ.17,000 చెల్లించాడు. వీరు నలుగురు స్నేహితులతో కలిసి క్వేక్ అరీనా పబ్‌లో నాలుగు MDMA మాత్రలు వినియోగించారు. ఈ నెట్‌వర్క్ దిల్లీ, బీదర్ నుంచి గంజాయి, సింథటిక్ డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా సరఫరా చేసింది. నిందితులు DTDC, శ్రీ మారుతి కొరియర్స్ ద్వారా దిల్లీ నుంచి ఓజీ వీడ్, బీదర్ నుంచి గంజాయిని సరఫరా చేశారు. 28 గ్రాముల ఓజీ వీడ్‌ను రూ.30,000కు కొని, గ్రామును రూ.2,500కు అమ్మారు. UPI, నగదు ద్వారా చెల్లింపులు జరిగాయి. విద్యార్థులైన భాస్కర్, దినేష్ "నిక్" నుంచి MDMA మాత్రలు కొన్నారు.
కొరియర్ల ద్వారా డ్రగ్స్ రవాణా
ఈ వివరాలపై స్పష్టమైన సమాచారం తెలియడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ రాకెట్ విద్యార్థులను వినియోగదారులు, సరఫరాదారులుగా మార్చింది. యూనివర్సిటీ అధికారులు, కొరియర్ సంస్థల నిర్లక్ష్యం వల్ల కొరియర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఈగల్ బృందం సైబరాబాద్ నార్కోటిక్ PSలో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. గత ఏడాదిలో సింబయోసిస్, CBIT, JNTU వంటి సంస్థలలో ఇలాంటి దాడులు జరిగాయి.
EAGLE Telangana Busts a Drug Racket in Mahindra University, Hyderabad
— Jacob Ross (@JacobBhoompag) August 26, 2025
(04) Arrested, 1.15 Kg Ganja & 47 Grms OG Weed Seized, 50 Students Under Probe
The sleuths of EAGLE Telangana have cracked down on a major interstate drug peddling racket that was supplying narcotics to… pic.twitter.com/fwsHbBDVS2
ఈ డ్రగ్స్ టీంలో నలుగురు కీలక నిందితులు నెవెల్ తోంగ్‌బ్రామ్ మణిపూర్, అంబటి గణేష్ అమ్మకాలు, బూసా శివకుమార్ బీదర్ నుంచి గంజాయి సరఫారా, ఆషార్ జావేద్ ఖాన్ క్యాంపస్‌లో పంపిణీ చేసే నలుగుర్ని అరెస్టు చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, కొరియర్ సంస్థలు జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్ సమాచారాన్ని ఈగల్‌కు (1908, 87126 71111) తెలియజేయాలని ఈగల్ టీం పిలుపునిచ్చింది.





















